Kulasekhar
-
ప్రముఖ సాహితీవేత్త కులశేఖర్‌రావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మడుపు ఎం.కులశేఖర్‌రావు ఆదివారం రాత్రి కెనడాలో కన్నుమూశారు. కొంతకాలంగా ఒంటారియాలోని బ్రాఫ్టన్‌లో ఉంటున్న కులశేఖర్‌రావుకు ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం) నిద్రలో గుండెపోటురాగా అంబులెన్స్ వచ్చేలోపే మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో జన్మించిన కులశేఖర్‌రావు తెలంగాణలో తొలితరం సాహితీవేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ తెలుగు చదివారు. ఆంధ్ర వచన వాజ్ఞ్మయ వికాసంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖలో మూడున్నర దశాబ్దాలపాటు లెక్చరర్‌గా, రీడర్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, శాఖ అధిపతిగా సేవలందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పలు రచనలు, పద్యరచనలు సైతం అందించారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలో రాశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య బహుముఖి వ్యక్తిత్వంపై ఆంగ్లంలో ఒక గ్రంధాన్ని రచించారు. కొన్నాళ్లుగా కెనడాలో కుమారుడు ప్రభాకర్‌రావు వద్దనే ఉంటున్నారు. కులశేఖర్‌రావు తెలంగాణ సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ సంతాపం కులశేఖర్‌రావు మృతికి తెలంగాణ సారస్వతపరిషత్ సోమవారం ప్రగాఢ సంతాపం తెలిపింది. వచన వాజ్ఞ్మయ వికాసంపై ఆయన చేసిన పరిశోధన ప్రామాణికమైందని, కవిగా, విమర్శకులుగా విశిష్ట కృషి చేశారని పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధానకార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య అన్నారు. -
పూజారులు వెలివేశారు.. భార్య వదిలేసింది
సాక్షి, హైదరాబాద్: ‘నేను బ్రాహ్మణుడిని.. నా తండ్రి వైజాగ్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేసేవారు. ఆ సమయంలో నేను బ్రాహ్మణులపై రాసిన పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణసమాజం నన్ను వెలివేసింది. అప్పటి నుంచి మానసిక క్షోభకు గురయ్యాను. వ్యవస్థపై కక్ష పెంచుకున్నాను. అందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లను చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శఠగోపాన్ని ఎత్తుకెళ్లా. నాలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కసితోనే ఇలా చేస్తున్నాను’ అని ఆలయాల్లో పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లు, శఠగోపాలు తస్కరిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన ప్రముఖ సినీ గేయరచయిత తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ పేర్కొన్నారు. చోరీ కేసులో అరెస్టైన కులశేఖర్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. విశాఖపట్నం జిల్లా, సింహాచలం బృందావన్‌కాలనీకి చెందిన కులశేఖర్ నగరంలోని మోతీనగర్‌లో అద్దెకుంటున్నాడు. ఒకవైపు బ్రాహ్మణ సమాజం వెలివేయగా మరో వైపు కట్టుకున్న భార్య కూడా అతడిని వదిలేసి పిల్లలతో సహా వెళ్లిపోయింది. దీంతో తాను పిచ్చివాడినయ్యానని చెప్పుకొచ్చాడు. తరచూ పోలీసులకు చిక్కుతున్నా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా అది మరింత పెరుగుతున్నట్లు తెలిపాడు. ప్రముఖ సినీ గేయ రచయితగా గుర్తింపు పొందిన కులశేఖర్ వంద సినిమాలకు పాటలు రాశాడు. అందులో 50 శాతం సూపర్ హిట్ కావడం విశేషం. రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినా అతని వైఖరిలో మార్పు రాలేదు. 2008 నుంచి మెదడుకు సంబంధించిన వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడమే కాకుండా తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సినీ పాటల రచయిత కులశేఖర్ అరెస్ట్
హైదరాబాద్: దేవాలయాల్లో పూజారుల కళ్లుగప్పి శఠగోపాలు, వారి సెల్ఫోన్లు, డబ్బు లు చోరీచేస్తున్న ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్‌ను బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నానికి చెందిన తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్(47) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటూ పలు సినిమాలకు పాటలు రాశాడు. సంతోషం, ఘర్షణ, ప్రేమలేఖ, ఫ్యామిలీ సర్కస్, చిత్రం, జయం, వసంతం, మృగరాజు, ఇంద్ర తదితర వంద సినిమాలకు పాటలు రాశాడు. కొంతకాలంగా అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజారి బ్యాగ్ చోరీకి గురవ్వగా, పోలీసులు నిఘా వేసి సీసీ కెమెరా ఫుటేజీలు, కదలికల ఆధారంగా కులశేఖర్‌ను విచారించడంతో గుట్టురట్టయింది. గతంలో గుడిలో చోరీ చేసిన కేసులో 6 నెలల జైలు శిక్ష అనుభవించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి రూ.50 వేల విలువ చేసే పది సెల్ఫోన్లు, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వందకు పైగా సినిమాలకు కులశేఖర్ పాటలు రాశాడు. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమై చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు జైలుశిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరం పెట్టింది. బ్రాహ్మణుల మీద కులశేఖర్ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.