Published
Thu, Oct 31 2013 12:31 AM
| Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
కన్నడ నిర్మాతతో సినిమా
చాలా విరామం తర్వాత ‘బలుపు’తో విజయం అందుకున్న రవితేజ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మునుపటిలా వెంటవెంటనే కాకుండా, చాలా పకడ్బందీ ప్రణాళికతో సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘బలుపు’ విడుదలై నాలుగు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకూ ఆయన కొత్త ప్రాజెక్ట్ ఏమిటనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘బలుపు’కు రచన చేసిన ‘బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ అంగీకరించారు. తొలుత ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి నిర్మాణంలో చేయాలనుకున్నారు. ఇప్పుడా ప్రాజెక్ట్ చేతులు మారింది. కన్నడంలో అగ్ర నిర్మాత అయిన ‘రాక్ లైన్’ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. వచ్చే నెలలోనే ఈ చిత్రం మొదలుకానుంది.