Balupu
-
రవితేజ సినిమాతో రీ ఎంట్రీ
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. ఫైనల్‌గా పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్నారు శృతి. అయితే తరువాత కూడా శృతి హాసన్ కెరీర్ సాఫీగా సాగలేదు. నెమ్మదిగా కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో శృతి సినిమాలకు దూరమైయ్యారు. గత ఏడాది కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్.. లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ తెలుగు సినిమాకు శృతి హాసన్ ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు శృతి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బలుపు సినిమాలో రవితేజకు జోడీగా నటించిన శృతి ఈ సినిమాలో మరోసారి మాస్ మహారాజ్‌తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. -
రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ బలుపు
నటుడు రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం బలుపు అని ఆ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యానించారు. క్రేజీ నటి శ్రుతీహాసన్, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నటి రాయ్‌లక్ష్మి ముఖ్యపాత్రను పోషించారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, జయ్‌ప్రకాశ్, ఆదిత్యమీనన్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం విడుదలై చాలా రోజులైంది, ఇప్పుడెందుకు మళ్లీ చెబుతున్నారనేగా ప్రశ్న. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఎవండా పేరుతో తమిళం మాట్లాడనుంది. ఇంతకు ముందు సెల్వందన్, బ్లూస్లీ-2 వంటి పలు విజయవంతమైన చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ అధినేత ప్రసాద్ ఈ ఎవండా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్వాతి, హర్షిణి సమర్పణలో అడ్డాల వెంకట్రావు, సత్య సీతల సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మాటలను ఏఆర్కే.రాజరాజా అందిస్తున్నారు. కాగా ఎవండా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాగ్వుర్ తంగం చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ తమిళంలో ఎవండాగా రానున్న బలుపు చిత్రం హీరో రవితేజ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందన్నారు. చిత్ర కథను ఎంతగానో ప్రేమించి రూపొందించామన్నారు. జనరంజక అంశాలతో కూడిన మంచి కమర్షియల్ చిత్రం ఇదని పేర్కొన్నారు. చిత్రంలో బోలెడు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలిపారు. సంగీత దర్శకుడు త మన్ ఆరు హిట్ పాటల్ని ఇచ్చారని చెప్పారు. తెలుగులో బలుపు అన్నది చాలా పవర్ఫుల్ టైటిల్ అనీ, తమిళంలోనూ ఎవండా పవర్‌ఫుల్‌గా ఉందనీ అన్నారు. చిత్ర తమిళ పోస్టర్లలో తన పేరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననీ, బలుపు తమిళంలోనూ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ రవితేజతో తాను చేసిన ఎనిమిదో చిత్రం బలుపు, అదే విధంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో నాలుగవ చిత్రం ఇప్పుడు ఐదవ చిత్రం చేయనున్నాను అని అన్నారు. గోపీచంద్ తెలుగుతో పాటు తమిళంలోనూ చిత్రాలు చేయాలని అన్నారు. సహనిర్మాత అడ్డాల వెంకట్రావు మాట్లాడుతూ ఎవండా మంచి మాస్ ఎంటర్టెయినర్ చిత్రం అని తెలిపారు. ఈ సంస్థ నుంచి నెలకొక చిత్రం చొప్పున ఐదు నెలలలో ఐదు చిత్రాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. బలుపు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనీ ప్రయత్నించామనీ, ఇద్దరు హీరోలతో సంప్రదింపులు కూడా చేశామనీ నిర్మాత ప్రసాద్ తెలిపారు. అయితే ఈ చిత్రం చేయడానికి ఆ హీరోలు సాహసించలేక పోయారనీ చెప్పారు. ఇకపై కూడా నెలకో చిత్రం చేస్తామనీ తదుపరి ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలిపారు. ఎవండా చిత్రాన్ని ఈ నెల 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ప్రసాద్ వెల్లడించారు. -
కోలీవుడ్‌లో రవితేజ బలుపు
టాలీవుడ్లో సూపర్‌హిట్ అయిన చిత్రం బలుపు. మాస్ మహరాజ్‌గా ప్రాచుర్యం పొందిన రవితేజ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో గ్లామర్ క్వీన్ శ్రుతిహాసన్, అంజలి నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు. ప్రేమ,హాస్యం,యాక్షన్ అంటూ కమర్షియల్ అంశాలతో జనరంజకంగా రూపొందిన బలుపు చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు ఎవండా అనే పేరుతో రానుంది. స్వాతి, హర్షిణి సమర్పణలో ఇంతకు ముందు సెల్వందన్, బ్రూస్లీ-2 వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకట్రావు, సత్యా, సిద్ధా సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్కే.రాజా మాటలను అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక టీ.నగర్, పెరియార్ రోడ్డులో గల ఎంఎం థియేటర్లో జరిగింది. చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ వయసు వచ్చిన తన కొడుకుకు పెళ్లి సంబంధాలు రాకపోవడంతో హీరో తండ్రి ప్రకాష్‌రాజ్ కనిపించిన అమ్మాయిల్ని రవితేజను ప్రేమించమని చెబుతుంటాడన్నారు. అలా చిన్న పిల్లల్ని మోసం చేసే శ్రుతిహసన్‌కు రవితేజను ప్రేమించమని అంటారన్నారు. మరో వైపు ప్రకాష్‌రాజ్‌ను, ఆయన కొడుకు రవితేజను అంతం చేయడానికి విలన్ గ్రూప్ వెంటాడతారని తెలిపారు.శ్రుతిహసన్ రవితేజను ప్రేమించిందా? వారి ప్రేమఎటు వైపు దారి తీసింది? అసలు విలన్ల గ్రూప్ రవితేజనే,ఆయన తండ్రిని ఎందుకు చంపాలనుకుంటారు?ఇత్యాది పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే ఎవండా చిత్రం అని నిర్మాతలు వెల్లడించారు. -
తండ్రి రాజయ్యాడు...కొడుక్కి 'బలుపు' పుట్టుకొచ్చింది
-
రవితేజా కొత్త సినిమా ప్రారంభం
-
కన్నడ నిర్మాతతో సినిమా
చాలా విరామం తర్వాత ‘బలుపు’తో విజయం అందుకున్న రవితేజ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మునుపటిలా వెంటవెంటనే కాకుండా, చాలా పకడ్బందీ ప్రణాళికతో సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘బలుపు’ విడుదలై నాలుగు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకూ ఆయన కొత్త ప్రాజెక్ట్ ఏమిటనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘బలుపు’కు రచన చేసిన ‘బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ అంగీకరించారు. తొలుత ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి నిర్మాణంలో చేయాలనుకున్నారు. ఇప్పుడా ప్రాజెక్ట్ చేతులు మారింది. కన్నడంలో అగ్ర నిర్మాత అయిన ‘రాక్ లైన్’ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. వచ్చే నెలలోనే ఈ చిత్రం మొదలుకానుంది. -
బొమ్మరిల్లు బ్యానర్లో... బాబీ దర్శకత్వంలో...
తన కెరీర్లో ఎన్ని విజయాలున్నా ‘బలుపు’ విజయం మాత్రం రవితేజకు ప్రత్యేకం. ఎందుకంటే... ఆ ఒక్క విజయం ఆయనకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. ‘బలుపు’ విజయంలో కీ రోల్ ప్లే చేసింది ఆ సినిమా సంభాషణలు. అందులోని రవితేజ మార్క్ పంచ్ డైలాగులు డైనమేట్లలా పేలాయన్నది నిజం. అందుకే అనుకుంటా... ఆ సినిమాకు సంభాషణలు అందించిన బాబీని రవితేజ దర్శకుణ్ణి చేసేశారు. రవితేజతో ‘నిప్పు’లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన వైవీఎస్ చౌదరి ‘బొమ్మరిల్లు’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిరాడంబరంగా జరిగాయి. ఇప్పటివరకూ వచ్చిన రవితేజ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. బాబీ కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనుందని సమాచారం. రవితేజ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా వైవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కథానాయిక, ప్రధాన తారాగణం వివరాలతో పాటు షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది త్వరలోనే అధికారికంగా తెలియనుంది. -
సాక్షి సినిమా 17th July 2013
-
లక్కీ లక్ష్మీరాయ్