
కోలీవుడ్‌లో రవితేజ బలుపు
టాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన చిత్రం బలుపు. మాస్ మహరాజ్‌గా ప్రాచుర్యం పొందిన రవితేజ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో గ్లామర్ క్వీన్ శ్రుతిహాసన్, అంజలి నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు. ప్రేమ,హాస్యం,యాక్షన్ అంటూ కమర్షియల్ అంశాలతో జనరంజకంగా రూపొందిన బలుపు చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు ఎవండా అనే పేరుతో రానుంది.
స్వాతి, హర్షిణి సమర్పణలో ఇంతకు ముందు సెల్వందన్, బ్రూస్‌లీ-2 వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకట్రావు, సత్యా, సిద్ధా సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌కే.రాజా మాటలను అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక టీ.నగర్, పెరియార్ రోడ్డులో గల ఎంఎం థియేటర్‌లో జరిగింది. చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ వయసు వచ్చిన తన కొడుకుకు పెళ్లి సంబంధాలు రాకపోవడంతో హీరో తండ్రి ప్రకాష్‌రాజ్ కనిపించిన అమ్మాయిల్ని రవితేజను ప్రేమించమని చెబుతుంటాడన్నారు.
అలా చిన్న పిల్లల్ని మోసం చేసే శ్రుతిహసన్‌కు రవితేజను ప్రేమించమని అంటారన్నారు. మరో వైపు ప్రకాష్‌రాజ్‌ను, ఆయన కొడుకు రవితేజను అంతం చేయడానికి విలన్ గ్రూప్ వెంటాడతారని తెలిపారు.శ్రుతిహసన్ రవితేజను ప్రేమించిందా? వారి ప్రేమఎటు వైపు దారి తీసింది? అసలు విలన్ల గ్రూప్ రవితేజనే,ఆయన తండ్రిని ఎందుకు చంపాలనుకుంటారు?ఇత్యాది పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే ఎవండా చిత్రం అని నిర్మాతలు వెల్లడించారు.