![YVS Chowdary on Carona Virus - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/31/YVS-Chowdary.jpg.webp?itok=6bdpVPb6)
‘‘... అది పాత తెలుగు సినిమా పాటా కాదు.. నాలుక మీద నుంచి దొర్లిన పదాల కలయికా కాదు.. కుశలమా?.. నీకు కుశలమేనా? అన్నది మన ఆత్మీయుల యోగక్షేమాలను తెలుసుకోవాలనుకునే తొలి పలకరింపు’’ అంటున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయన తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు.
‘‘కరోనా–వైరస్ వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో నీకు కుశలమేనా? అనే పలకరింపుకి పని కల్పించండి. మన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మన వద్ద పని చేస్తున్నవాళ్లు.. ఇలా వారి యోగ–క్షేమాల్ని తెలుసుకోవడమే కాకుండా, మీ మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ వారిలో మానసిక స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని నింపండి. వారికి అవసరమైతే మీకు కుదిరినంత ఆర్థికసాయం చేయండి.
మన ప్రభుత్వాలు విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఉంటూ కరోనా కట్టడికి చేపట్టాల్సిన జాగ్రత్తల్ని స్వయం నియంత్రణతో పాటించండి. బాధ్యతగల పౌరులుగా ఇంటిపట్టునే ఉండి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి’’ అంటూ ఆ దేవుని దయతో ప్రస్తుతానికి నేను, నా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నాం. ఆ దేవుని దయ మీకూ ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నా అన్నారు వైవీఎస్.
Comments
Please login to add a commentAdd a comment