నారా vs నందమూరి | nandamuri taraka ratana vilain in nara rohith film | Sakshi
Sakshi News home page

నారా vs నందమూరి

Published Tue, Nov 10 2015 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

నారా vs నందమూరి

నారా vs నందమూరి

ప్రస్తుతం టాలీవుడ్ అందరికంటే బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్. దాదాపు పది సినిమాలు చేతిలో ఉన్న ఈ యంగ్ హీరో ఇటీవలే 'రాజా చెయ్యి వేస్తే' అనే సినిమా అంగీకరించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ను కూడా సెట్ చేస్తున్నాడు రోహిత్. కొత్త దర్శకుడు ప్రదీప్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్గా నందమూరి వారసుడిని ఎంపిక చేశారు.

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్న నటుడు తారక రత్న. గ్రాండ్గా లాంచ్ అయినా, తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాతో విలన్గా మారిన ఈ నందమూరి చిన్నోడు చాలాకాలం తర్వాత మరోసారి ప్రతినాయక నటిస్తున్నాడు. అది నారా రోహిత్కు ప్రతినాయకుడిగా కావటంతో ఈ వార్త మరింత హాట్ టాపిక్గా మారింది.

వారాహి చలనచిత్ర బ్యానర్పై సక్సెస్ఫుల్ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రోహిత్ కెరీర్లో గతంలో ఎన్నడూ చేయని విధంగా ఫుల్లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ప్రదీప్. వెండితెర మీద నారా వర్సెస్ నందమూరి ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement