తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ మెగా కన్వెన్షన్ అమెరికాలోని సియాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగా వైభవంగా జరిగింది. మే 24 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో.. ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు అలరించాయి. తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా వెస్ట్ కోస్ట్ సిటీలోని సియాటెల్ లో జరిగిన అతి పెద్ద టీటీఏ తెలుగు ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. వాషింగ్టన్‌లోని సియాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.
సియాటెల్ తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. ఈ భారీ మొదటి తెలుగు మహాసభలను వ్యయ ప్రయాసలకు వెరవకుండా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించటం మరో విశేషం. .కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు మూడు రోజుల పాటు వేటికవే వినూత్నమైన కార్యక్రమాలతో నభూతో నభవిష్యతీ అనేలా నిర్వహించారు.
సంస్థ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల సారథ్యంలో పలు కమిటీలు, వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి టీటీఏ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేసి సందడి చేశారు. కన్వెన్షన్ రెండవ రోజు సాయంత్రం సుమారు 13,500 మందికి పైగా, ముగింపు వేడుకల్లో ఏకంగా 17,500 మందికి పైగా హాజరైనట్లు నిర్వహకులు పేర్కొన్నారు.
కన్వెన్షన్ బాంక్వెట్ డిన్నర్ :
టీటీఏ మహాసభల్లో భాగంగా బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇండియా నుంచి విచ్చేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. వ్యాపార, ఆరోగ్య, క్రీడలు, సామాజికసేవ, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలోని అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ టీటీఏ అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, ఇతర జాతీయ తెలుగు సంఘాల నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.
ఈ మొత్తం బాంక్వెట్ డిన్నర్‌కి మూల స్తంభాలైన బాంక్వెట్ కమిటీని వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీస్ పాల్గొని యూత్ ని అలరించారు. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ షో ఆకట్టుకుంది. వందేమాతరం శ్రీనివాస్ సారధ్యంలోని గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. భక్తి పాటలు, జానపదాలు, సినిమా పాటలతో అలరించారు. కార్యక్రమం ఆసాంతం ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనదైన శైలి వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు.
కన్వెన్షన్ రెండోవ రోజు :
మెగా కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఇండియా డే పెరేడ్ ఆకట్టుకుంది. బోనాలు, బతుకమ్మ, పోతురాజు తో మహిళలు, టీటీఏ నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్‌కి విచ్చేశారు. కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా ప్రారంబమయ్యాయి. అమెరికా, భారత్ జాతీయ గీతాల తోపాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, తదితరులు ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
రెండో రోజు కన్వెన్షన్ లో బాగంగా బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టీటీఏ స్టార్ట్‌ప్ కబ్, మాట్రిమోనీ, సీఎంఈ, అష్టావధానం, టీటీఏ స్టార్ , బ్యూటీ పాజెంట్ , ఫైర్సైడ్ చాట్ , యూత్ సెషన్స్, పొలిటికల్ మీట్ & గ్రీట్స్ నిర్వహించారు. కన్వెన్షన్ లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీల, మెహ్రీన్ లను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు. యాంకర్స్ సుమ, రవి యాంకరింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. డా. హరనాథ్ పోలిచెర్ల చేసిన సేవలకుగాను టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన త్రీయరీ బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండోవ రోజు కన్వెన్షన్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వైఎస్సార్ జయంతి వేడుకలు :
మెగా కన్వెన్షన్‌లో పొలిటికల్ మీట్ & గ్రీట్స్ ఏర్పాటు చేశారు. మహాసభలో భాగంగా వైఎస్సార్‌సీపీ మీట్ అండ్ గ్రీట్ తో పాటు డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు, రాజన్న అభిమానులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు.
కన్వెన్షన్ మూడోవ రోజు: కన్వెన్షన్ మూడో రోజు భధ్రాచలం నుంచి విచ్ఛేసిన పండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. ప్రవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహాసభల్లో భాగంగా వివిధ ఎక్సిబిట్ రూమ్స్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. టీటీఏ స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, బిజినెస్ సెమినర్స్, ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్, ఫిట్నెస్ వర్కషాప్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి . సాంస్కృతిక కార్యక్రమాలు వీనుల విందుగా జరిగాయి. డోనార్స్ ని, కార్పొరేట్ స్పాన్సర్‌ని ఘనంగా సత్కరించారు. బ్యూటీ పాజంట్, టీటీఏ స్టార్ విజేతలకు క్రౌన్, బహుమతులను అందజేశారు.
డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం :
మెగా కన్వెన్షన్‌లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అమెరికాలోని ప్రముఖ డాక్టర్, ప్రైమ్ హెల్త్‌కేర్ అధినేత, తెలుగుసంఘాలకు, కమ్యూనిటికీ నేస్తంగా, దాతగా పేరు పొందిన డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డికి టీటీఏ లైఫ్ టైం అచీవ్‌మెంట్ ర్డు దించి, ఘనంగా సత్కరించారు. నాటా వ్యవస్థాపకలు డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి టీటీఏకార్యవర్గం, బోర్డు సభ్యులు మరియు నాటా లీడర్షిప్ సమక్షంలో ఈ అవార్డు అందించారు. ఈ సందర్భంగా డా. ప్రేమ్ రెడ్డి తన జీవిత సత్యాలను యువతను ఇన్స్పైర్ చేసేలా వివరించారు.
అతిథులకు సన్మానం: కన్వెన్షన్ వేదికపై టాలీవుడ్ సెలబ్రేటీలను ఘనంగా సన్మానించి, సత్కరించారు. టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజులను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ నిర్వహణ వివరాలు పంచుకొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కన్వెన్షన్ కమిటీల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ యువతను అలరించింది. తమన్ టీమ్ సినిమా పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు.
థమన్ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసింది. టీటీఏ మహాసభలకు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ హైలైట్ గా నిలిచింది. టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ తెలుగు మహాసభలు అందించాయి. ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, మాటా ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో- మరెన్నో కార్యక్రమాలతో.. మూడు రోజుల పాటు సియాటెల్‌లో తెలుగు పండగ వాతావరణం నెలకొంది. తెలుగు మహా సభలు అంటే ఇలా ఉండాలి అనేలా ఈ వేడుకలు నిలిచాయి. భవిష్యత్ లో జరిగే మహాసభలకు సరి కొత్త మార్గాన్ని చూపించాయి.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment