మెగాస్టార్‌ మూవీ సూపర్‌హిట్‌ కావాలి | mega star movie sai dharam tej | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌ మూవీ సూపర్‌హిట్‌ కావాలి

Published Thu, Aug 18 2016 4:30 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

మెగాస్టార్‌ మూవీ సూపర్‌హిట్‌ కావాలి - Sakshi

మెగాస్టార్‌ మూవీ సూపర్‌హిట్‌ కావాలి

అంతర్వేదిలో హీరో సాయి ధరమ్‌తేజ హోమం
అంతర్వేది (సఖినేటిపల్లి) : మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం పూర్తిస్థాయిలో విజయం సాధించాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఈ చిత్రానికి పని చేయాలని కోరుకుంటూ ఆయన మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్‌తేజ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల హోమాలు నిర్వహించారని తెలిపారు.
 
అభిమానులు కూడా ఆరోగ్యంగా ఉండాలని హోమంలో తాను ప్రార్థించానన్నారు. తాను ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నక్షత్రం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నానని, కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ సరసన 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ కూడా పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనుంది. చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, రావి మురళి, గుండాబత్తుల తాతాజీ, అడబాల రాజప్ప, నామన నాగభూషణం, అధిక సంఖ్యలో అభిమానులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement