'డాడా' లాంటి హిట్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న నటుడు కవిన్.. మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. దీనికి 'స్టార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ ఇళన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎళిల్ అరసు ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రైస్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
(ఇదీ చదవండి: బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)
ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. చైన్నె, ముంబైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని దర్శకుడు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇందులో ముంబై బ్యూటీ హీరోయిన్ కాగా, మలయాళ నటుడు కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఇంట్రో సాంగ్ కోసం భారీ సెట్‌ను వేసి వేసినట్లు చెప్పారు. యువన్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31న 'స్టార్' స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇకపోతే కవిన్.. మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించాడు.
(ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment