కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్' | Kavin Star Movie Details And Release Date | Sakshi
Sakshi News home page

Star Movie: కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'

May 4 2024 2:55 PM | Updated on May 4 2024 2:55 PM

Kavin Star Movie Details And Release Date

'ప్రతి ఒక్కరూ కలలు కనాలి, వాటి సాకారం కోసం కృషి చేయాలి' అనే అబ్దుల్‌ కలాం సూక్తి ఆధారంగా తీసిన సినిమా 'స్టార్‌'. ఇలన్‌ దర్శకుడు. 'దాదా' ఫేమ్‌ కవిన్‌ హీరో. అతిథి పొహంగర్, కీర్తీ మురుగన్‌ హీరోయిన్స్. రైస్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందించాడు. ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు.

(ఇదీ చదవండి: స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)

1980ల్లో మధురైకు చెందిన ఓ కుర్రాడు.. సినిమా నటుడు కావాలనే కలతో చెన్నైకి చేరుకుంటాడు. అతడు తన కల నెరవేర్చుకోవడానికి చేసే పోరాటమే 'స్టార్‌' సినిమా. ఇకపోతే దర్శకుడు తనకు కథ చెప్పిన విధానం నచ్చిందని హీరోగా చెప్పగా.. ఈ చిత్రంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు ఇలన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement