బాలీవుడ్‌లో అర్ధాంతరంగా నేల రాలిన తార సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అతని చావుతో యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బిహార్‌లోని పర్నియాలో ఓ రహదారికి సుశాంత్ పేరును పెట్టి అభిమానం చాటుకున్నారు. అమెరికాలోని రక్ష అనే ఓ అభిమానైతే ఏకంగా ఆకాశంలోని నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఫొటో కూడా జత చేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని నిజమనే నమ్మి ఆమె అభిమానం చాటుకున్న తీరుకు అబ్బురపడ్డారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?)
అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య(ఐఏయూ) శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. రాజ్‌పుత్ పేరు మీద ఎలాంటి నక్షత్రం లేదని వివరణ ఇచ్చారు. ఐఏయూ ఓటింగ్ సభ్యుడు డా. అశ్విన్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ సెలబ్రిటీ కానీ, ఎవరి పేరైనా సరే నక్షత్రానికి పెట్టే హక్కు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యకు మాత్రమే ఉంది అని తెలిపారు. అయితే చాలామంది తమకు నచ్చిన పేర్లను తారలకు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దీంతో అసలు సుశాంత్ పేరున నక్షత్రం అనే వార్త తప్పని రుజువైంది. కాగా జూన్ 14న ముంబైలోని తన స్వగృహంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే (నక్షత్రానికి సుశాంత్ పేరు)
Comments
Please login to add a commentAdd a comment