హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ), మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) సంయుక్తంగా బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నాయి. ప్రాజెక్ట్ విలువ రూ.3,681 కోట్లు. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుంచి ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాయి.
508.17 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్‌లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ను హెచ్‌సీసీ, ఎంఈఐఎల్ నిర్మిస్తాయి. ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేస్తారు. 16 కోచ్‌లు ఉన్న బుల్లెట్ ట్రెయిన్ నడవడానికి వీలుగా ఒక్కొక్కటి 414 మీటర్ల పొడవులో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తారు.
మెట్రో, రోడ్డు మార్గాలకు అనుసంధానంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ ఉంటుందని హెచ్‌సీసీ తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ మార్గంలో భూగర్భంలో ఉండే ఏకైక స్టేషన్ ఇదే. నేల నుంచి 24 మీటర్ల లోపల ఏర్పాటు చేస్తారు. మూడు అంతస్తుల్లో స్టేషన్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment