న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్ సంస్థ భారీ బులెట్ రైలు కాంట్రాక్టును దక్కించుకుంది. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) నుంచి ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ (ఎంఏహెచ్‌ఎస్‌ఆర్) ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
సుమారు 116 రూట్ కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ను నిర్మించాల్సి ఉంటుంది. గంటకు 320 కి.మీ. వరకూ వేగంతో రైలు ప్రయాణించేందుకు అనువు గా దీన్ని రూపొందించాలి.
ఇందుకోసం జపాన్‌కి చెందిన షింకన్‌సెన్ ట్రాక్ టెక్నాలజీని ఎల్‌అండ్ టీ ఉపయోగించనుంది. రూ. 2,500 కోట్లు–రూ. 5,000 కోట్ల వరకూ విలువ చేసే ప్రాజెక్టులను ఎల్‌అండ్‌టీ సంస్థ భారీ కాంట్రాక్టుగా వర్గీకరిస్తుంది
చదవండి👉దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..!
Comments
Please login to add a commentAdd a comment