l and t metro
-
దేశంలో బులెట్ ట్రైన్, జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ బులెట్ రైలు కాంట్రాక్టును దక్కించుకుంది. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) నుంచి ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. సుమారు 116 రూట్ కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ను నిర్మించాల్సి ఉంటుంది. గంటకు 320 కి.మీ. వరకూ వేగంతో రైలు ప్రయాణించేందుకు అనువు గా దీన్ని రూపొందించాలి. ఇందుకోసం జపాన్‌కి చెందిన షింకన్సెన్ ట్రాక్ టెక్నాలజీని ఎల్అండ్ టీ ఉపయోగించనుంది. రూ. 2,500 కోట్లు–రూ. 5,000 కోట్ల వరకూ విలువ చేసే ప్రాజెక్టులను ఎల్అండ్టీ సంస్థ భారీ కాంట్రాక్టుగా వర్గీకరిస్తుంది చదవండి👉దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..! -
హైదరాబాద్ మెట్రో రికార్డ్! ఒక్క రోజులో రూ.13,119 కోట్లు సమీకరణ..
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో భారీగా నిధులు సమీకరించింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ , కమర్షియల్ పేపర్ల ద్వారా రూ.13,119 కోట్లు సమీకరించింది. ఒక్కరోజుల్లో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించడంలో ఇదో రికార్డుగా నిలిచింది. ఒక్కరోజులో నిధుల సమీకరణలో భాగంగా 2021 డిసెంబరు 29 బుధవారం మూడు రకాలైన బాండ్ పేపర్లను ఎల్ అండ్ టీ జారీ చేసింది. వీటిలో ఒక్కో బాండ్ ద్వారా రూ. 2,872 కోట్లు సమీకరించింది.. ఇలా బాండ్ పేపర్ల ద్వారా 8,616 కోట్లు సమీకరించింది. ఈ బాండ్ పేపర్లకు సంబంధించి వడ్డీ రేంజ్ 6.38 శాతం నుంచి 6.68 వరకు ఉంది. ఇక బాండ్ పేపర్ల మెచ్యూరిటీ విషయానికి వస్తే మూడేళ్ల నాలుగు నెలలు, నాలుగేళ్ల నాలుగు నెలలు, ఐదేళ్ల నాలుగు నెలలుగా ఉంది. మిగిలిన సొమ్మును కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ నిధుల సమీకరణలో భాగస్వామిగా వ్యవహరించింది. మిగిలిన నిధులు కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. ప్రత్యామ్నాయం కరోనా సంక్షోభం కారణంగా నష్టాలు పెరిగిపోవడంతో సాఫ్ట్‌లోన్ రూపంలో సాయం అందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో నిర్వహిస్తోన్న ఎల్ అండ్ టీ ప్రభుత్వాలను కోరింది. ప్రభుత్వం దగ్గర సాఫ్ట్‌లోన్ అంశంలో పెండింగ్‌లో ఉండగానే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయాలను ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో మార్కెట్ ద్వారా నిధులు సమీకరణ ఎల్ అండ్ టీకి సులువైంది. చదవండి: కరోనా కష్టాలు.. వరుస నష్టాలు.. బయటపడేందుకు ఎల్ అండ్ టీ కొత్త ప్లాన్ -
మెట్రో రైలుకు అడ్డంకులేమీ లేవు
-
మెట్రో రైలుకు అడ్డంకులేమీ లేవు: ఎల్అండ్టీ
జంటనగరాల ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఎల్అండ్టీ మెట్రోరైలు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అమలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేవని, కొంతమంది కావాలనే దీనిపై వదంతులు సృష్టిస్తున్నారని ఎల్అండ్టీ మెట్రో రైలు అధికారులు చెప్పారు. అయితే.. ప్రస్తుత రాజకీయ, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మెట్రోరైలు ప్రాజెక్టు మనుగడ సాధించడం కష్టమని, అందువల్ల తాము టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎల్అండ్టీ మెట్రోరైలు అధికారులు ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాలో వచ్చింది. ఇక తాము ఈ ప్రాజెక్టును చేపట్టలేమని, మీరే కట్టుకోవాలని వారు చెప్పినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇప్పుడు వాటిని ఎల్అండ్టీ వర్గాలు ఖండించాయి.