HCC
-
జెట్ స్పీడ్‌లో బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణ పనులు..రూ.3,681 కోట్లతో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ), మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) సంయుక్తంగా బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నాయి. ప్రాజెక్ట్ విలువ రూ.3,681 కోట్లు. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుంచి ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాయి. 508.17 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ను హెచ్‌సీసీ, ఎంఈఐఎల్ నిర్మిస్తాయి. ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేస్తారు. 16 కోచ్‌లు ఉన్న బుల్లెట్ ట్రెయిన్ నడవడానికి వీలుగా ఒక్కొక్కటి 414 మీటర్ల పొడవులో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తారు. మెట్రో, రోడ్డు మార్గాలకు అనుసంధానంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ ఉంటుందని హెచ్‌సీసీ తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ మార్గంలో భూగర్భంలో ఉండే ఏకైక స్టేషన్ ఇదే. నేల నుంచి 24 మీటర్ల లోపల ఏర్పాటు చేస్తారు. మూడు అంతస్తుల్లో స్టేషన్ ఉంటుంది. -
సన్ ఫార్మా స్పీడ్- హెచ్‌సీసీ బోర్లా
కోవిడ్-19 నేపథ్యంలో దేశీయంగా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు రికవరీ బాట పట్టాక హెల్త్‌కేర్ రంగ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో నిర్మాణ రంగ కంపెనీ హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సన్ ఫార్మా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్‌సీసీ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది మార్చి మూడో వారంలో రూ. 315 వద్ద కనిష్టాన్ని తాకిన హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా షేరు తదుపరి లాభపడుతూ వస్తోంది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 560 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 564 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! వెరసి గత ఐదు నెలల్లో 76 శాతం దూసుకెళ్లింది. వన్‌టైమ్ చార్జీల కారణంగా ఈ ఏడాది క్యూ1లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భారీ నష్టం ప్రకటించినప్పటికీ.. మార్జిన్లు మెరుగుపరచుకోవడం, స్పెషాలిటీ ప్రొడక్టుల విక్రయాలను నిలుపుకోవడం వంటి సానుకూల అంశాలు ఈ కౌంటర్‌కు బలాన్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. హెచ్‌సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌సీసీ రూ. 406 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(201920) క్యూ1లో రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2815 కోట్ల నుంచి రూ. 1690 కోట్లకు క్షీణించింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌సీసీ షేరు 6 శాతం పతనమై రూ. 6.30 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌కల్లా ఈ కౌంటర్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి 2.5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
సెంచరీతో చెలరేగిన చరణ్
సాక్షి, హైదరాబాద్: చరణ్ (142) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కున్ సీసీ146 పరుగుల తేడాతో హెచ్జీసీపై జయభేరి మోగించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కున్ సీసీ 4 వికెట్లకు 290 పరుగులు చేసింది. వరుణ్ గౌడ్ (81) అర్ధసెంచరీ చేయగా, తాహా షేక్ 30 పరుగులు చేశాడు. హెచ్‌జీసీ బౌలర్లలో శ్రవణ్ నాయుడు 3, సాయిచరణ్ 1 వికెట్ తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన హెచ్‌జీసీ జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. సాయిచరణ్ 35, సాయి 35 పరుగులు చేశాడు. కున్ బౌలర్లలో శివ 5, అంకిత్సింగ్, భార్గవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో శ్రీనాథ్ నాయక్ (70 నాటౌట్), సాత్విక్ (5/33) రాణించడంతో మణి కుమార్ జట్టు 10 వికెట్ల తేడాతో రిలయన్స్‌పై గెలిచింది. మొదట రిలయన్స్ 110 పరుగులకు కుప్పకూలింది. సాత్విక్ అద్భుత బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. తర్వాత మణి కుమార్ 111 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. శ్రీనాథ్ అజేయ అర్ధసెంచరీ చేయగా, సిద్ధార్థ 33 (నాటౌట్) పరుగులు చేశాడు. రాణించిన శ్రీచరణ్ ఇబ్రహీంపట్నంలోని గురుకుల్ మైదానంలో భారతీయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ల్యాండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్రీన్‌ల్యాండ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. గ్రీన్‌ల్యాండ్ జట్టులో శ్రీచరణ్ 86 పరుగులు చేశారు. 253 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారతీయ జట్టు శ్రీచరణ్ బౌలింగ్ ధాటికి 21 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. శ్రీచరణ్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.