చరణ్ (142) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కున్ సీసీ146 పరుగుల తేడాతో హెచ్‌జీసీపై జయభేరి మోగించింది.
సాక్షి, హైదరాబాద్: చరణ్ (142) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కున్ సీసీ146 పరుగుల తేడాతో హెచ్‌జీసీపై జయభేరి మోగించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కున్ సీసీ 4 వికెట్లకు 290 పరుగులు చేసింది. వరుణ్ గౌడ్ (81) అర్ధసెంచరీ చేయగా, తాహా షేక్ 30 పరుగులు చేశాడు. హెచ్‌జీసీ బౌలర్లలో శ్రవణ్ నాయుడు 3, సాయిచరణ్ 1 వికెట్ తీశారు.
తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన హెచ్‌జీసీ జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. సాయిచరణ్ 35, సాయి 35 పరుగులు చేశాడు. కున్ బౌలర్లలో శివ 5, అంకిత్‌సింగ్, భార్గవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో శ్రీనాథ్ నాయక్ (70 నాటౌట్), సాత్విక్ (5/33) రాణించడంతో మణి కుమార్ జట్టు 10 వికెట్ల తేడాతో రిలయన్స్‌పై గెలిచింది. మొదట రిలయన్స్ 110 పరుగులకు కుప్పకూలింది. సాత్విక్ అద్భుత బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. తర్వాత మణి కుమార్ 111 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. శ్రీనాథ్ అజేయ అర్ధసెంచరీ చేయగా, సిద్ధార్థ 33 (నాటౌట్) పరుగులు చేశాడు.
రాణించిన శ్రీచరణ్
ఇబ్రహీంపట్నంలోని గురుకుల్ మైదానంలో భారతీయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ల్యాండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్రీన్‌ల్యాండ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. గ్రీన్‌ల్యాండ్ జట్టులో శ్రీచరణ్ 86 పరుగులు చేశారు. 253 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారతీయ జట్టు శ్రీచరణ్ బౌలింగ్ ధాటికి 21 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. శ్రీచరణ్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.