కోవిడ్-19 నేపథ్యంలో దేశీయంగా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు రికవరీ బాట పట్టాక హెల్త్‌కేర్ రంగ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో నిర్మాణ రంగ కంపెనీ హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సన్ ఫార్మా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్‌సీసీ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..
సన్ ఫార్మాస్యూటికల్
ఈ ఏడాది మార్చి మూడో వారంలో రూ. 315 వద్ద కనిష్టాన్ని తాకిన హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా షేరు తదుపరి లాభపడుతూ వస్తోంది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సన్ ఫార్మా షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 560 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 564 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! వెరసి గత ఐదు నెలల్లో 76 శాతం దూసుకెళ్లింది. వన్‌టైమ్ చార్జీల కారణంగా ఈ ఏడాది క్యూ1లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భారీ నష్టం ప్రకటించినప్పటికీ.. మార్జిన్లు మెరుగుపరచుకోవడం, స్పెషాలిటీ ప్రొడక్టుల విక్రయాలను నిలుపుకోవడం వంటి సానుకూల అంశాలు ఈ కౌంటర్‌కు బలాన్నిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేర్కొంది.
హెచ్‌సీసీ లిమిటెడ్
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌సీసీ రూ. 406 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(201920) క్యూ1లో రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2815 కోట్ల నుంచి రూ. 1690 కోట్లకు క్షీణించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీసీ షేరు 6 శాతం పతనమై రూ. 6.30 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి 2.5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment