సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.
సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన SQ321 విమానం మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయింది.
బోయింగ్ 777-300 ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరిస్తూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.
విమానం ల్యాండ్ అయిన తరువాత అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని పనిచేస్తున్నట్లు.. ఇంకా అదనపు సహాయాన్ని అందించడానికి బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇటువంటి గాయాలు సాధారణంగా జరుగుతాయని నిపుణులు తెలిపారు. వాతావరణ రాడార్ నుంచి ముందస్తు సమాచారం అందకపోవడంతో పైలెట్ కూడా ముందుగా ప్రయాణికులను హెచ్చరికను ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోవడం వల్ల.. వారు కాక్‌పిట్‌లోకి పడే అవకాశం ఉంటుంది. అలంటి సమయంలో ఊహకందని ప్రమాదం జరుగుతుంది.
Singapore Airlines flight #SQ321, operating from London (Heathrow) to Singapore on 20 May 2024, encountered severe turbulence en-route. The aircraft diverted to Bangkok and landed at 1545hrs local time on 21 May 2024.
We can confirm that there are injuries and one fatality on…— Singapore Airlines (@SingaporeAir) May 21, 2024
Comments
Please login to add a commentAdd a comment