గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్‌లైన్స్ లాభాలను గడించింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్‌లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్‌లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment