న్యూఢిల్లీ: రాబోయే సీజన్‌ని పురస్కరించుకుని దక్షిణాసియా విమానయాన సంస్థలు భారీ ఆఫర్లతో భారతీయ విమాన ప్రయాణికులను ఊదరగొడుతున్నాయి. తాజాగా ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ప్రమోషనల్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించాయి. మలేసియా కేంద్రంగా పనిచేసే ఎయిర్‌ఏషియా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి అయిదేళ్లయిన సందర్భంగా కొన్ని ఉచిత టికెట్లను ప్రకటించింది. వచ్చే ఏడాది మే 5 నుంచి 2015 జనవరి 31 దాకా ప్రయాణించేందుకు ఈ టికెట్లు ఉపయోగపడతాయి. ఇందుకు సంబంధించి సోమవారం మొదలైన టికెట్ల బుకింగ్ డిసెంబర్ 1 దాకా కొనసాగుతుంది.
దీని కింద ఒక వైపు ప్రయాణానికి బేస్ రేటు లేకుండా టికెట్లు పొందవచ్చు. పన్నులు, ఇతరత్రా ఫీజులు మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇవి రూ.500 పైగా ఉంటాయి. అలాగే, రూ. 500 బేస్ రేటుతో కూడా కంపెనీ సీట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ల కింద మొత్తం ముఫ్ఫై లక్షల టికెట్లను సంస్థ విక్రయించనుంది. దీని ప్రకారం కొచ్చి నుంచి కౌలాలంపూర్ టికెట్ ధర రూ. 2,259గాను, చెన్నై నుంచి బ్యాంకాక్/ కౌలాలంపూర్ టికెట్ రేటు రూ. 2,704గాను, బెంగళూరు నుంచి కౌలాలంపూర్‌కి రూ. 3,269గాను, కోల్‌కతా నుంచి కౌలాలంపూర్‌కి రూ. 3,228గాను టికెట్ రేట్లు (పన్నులు, ఫీజులు అన్నీ కలిపి) ఉంటాయి.
మరోవైపు, సింగపూర్ ఎయిర్‌లైన్స్, దాని అనుబంధ సంస్థ సిల్క్‌ఎయిర్ కూడా ఆఫర్లు ప్రకటించాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి 12.5% డిస్కౌంట్ లభించనుంది. టికెట్ల బుకింగ్ డిసెంబర్ 21 దాకా ఉంటుంది. డిసెంబర్ 1-31లోగా చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఆస్ట్రేలియాకి వెడుతూ మార్గమధ్యంలో సింగపూర్‌లో ఆగాల్సి వచ్చే ప్యాసింజర్స్‌కి కాంప్లిమెంటరీ వోచర్లు కూడా ఇవ్వనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వీటిని సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్టులో ఉండే షాప్‌లు, రెస్టారెంట్లలో ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
విదేశీ ఎయిర్‌లైన్స్ ఆఫర్ల వెల్లువ
Published Tue, Nov 26 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement