న్యూఢిల్లీ: తాము ప్రారంభించనున్న విమానయాన సంస్థ ఎల్లవేళలా భారత చట్టాల నియంత్రణలోనే పనిచేస్తుందని ఒక సంయుక్త ప్రకటనలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ పేర్కొన్నాయి. ఈ వెంచర్ నిర్వహణ దేశీయ సంస్థ చేతిలోనే ఉంటుందని తెలిపాయి. టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ వెంచర్ ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగానూ విమానయాన సేవలను అందించేందుకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుమతించమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా దేశీయ నిర్వహణపై టాటా ఎస్‌ఐఏ తాజాగా వివరణ ఇచ్చింది.
ఈ వెంచర్‌లో టాటా సన్స్‌కు 51%, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49% చొప్పున వాటా ఉంటుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్‌చేయనున్న 4.9 కోట్ల డాలర్లకుగాను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎఫ్‌ఐపీబీ అనుమతిని పొందాల్సి ఉంది. దీంతోపాటు ఈ వెంచర్‌కు డీజీఎఫ్‌టీ, డీజీసీఏ, సీబీఈసీ వంటి ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాల్సి ఉంది. అంతేకాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు సైతం తప్పనిసరి.
భారత్ నియంత్రణలోనే టాటా ఎయిర్‌లైన్స్
Published Wed, Sep 25 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement