Tata SIA Airlines
-
31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ విస్తారా నష్టాలు భారీగా తగ్గాయి. రూ. 1,393 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2021–22) లో నమోదైన రూ. 2,031 కోట్లతో పోలిస్తే 31 శాతంపైగా రికవర్ అయ్యాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్(విస్తారా) మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 11,784 కోట్లను తాకింది. దీంతో నష్టాలు భారీగా తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే నెట్‌వర్త్ రూ. 1,250 కోట్ల నుంచి రూ. 502 కోట్లకు నీరసించింది. దేశీ విమానయాన పరిశ్రమ గతేడాది పటిష్ట వృద్ధిని సాధించినట్లు విస్తారా తెలియజేసింది. కోవిడ్ ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో సగటున ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులు నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఉమ్మడి నష్టం ఇలా.. టాటా గ్రూప్ వెలువరించిన 2022–23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేíÙయా, విస్తారాల ఉమ్మడి నష్టం రూ. 15,532 కోట్లుగా నమోదైంది. వెరసి 2021–22లో నష్టం రూ. 13,838 కోట్లు మాత్రమే. అయితే ఈ కాలంలో మూడు సంస్థల ఆదాయం పుంజుకున్నప్పటికీ ఎయిరిండియా విమానాలు, ఇంజిన్ల నిలుపుదల కారణంగా రూ. 5,000 కోట్లమేర అదనపు ప్రొవిజనింగ్ చేపట్టడంతో ఉమ్మడి నష్టాలు పెరిగాయి. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం గతేడాది ఎయిరిండియా ఆదాయం రూ. 31,377 కోట్లను దాటగా.. రూ. 11,388 కోట్ల నష్టం నమోదైంది. ఎయిరేíÙయా టర్నోవర్ రూ. 4,310 కోట్లుకాగా.. రూ. 2,750 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రం గతేడాది రూ. 5,669 కోట్ల ఆదాయం సాధించింది. అంతేకాకుండా రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
వచ్చే జూన్ నాటికి...టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ టేకాఫ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే-జూన్ నాటికల్లా దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ ..టాటా-ఎస్ఐఏ భావిస్తోంది. టాటా-ఎస్ఐఏ చైర్మన్ ప్రసాద్ మీనన్ విషయం తెలిపారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులు లభించిన నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, ఎస్ఐఏ చైర్మన్ గో చూన్ ఫాంగ్, మీనన్.. శుక్రవారం పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్‌తో సమావేశమయ్యారు. మిగతా అనుమతులు కూడా వేగంగా లభించగలవని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మీనన్ తెలిపా రు. మరోవైపు, పార్కింగ్ స్థలం, రూట్లు మొదలైన వాటికి సంబంధించి టాటా-ఎస్ఐఏ ఎంత వేగం గా వివరాలు సమర్పిస్తుందన్న దాన్ని బట్టి విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీ జీసీఏ వేగవంతంగా అనుమతు లు ఇవ్వడం ఆధారపడి ఉంటుందని అజిత్ సింగ్ చెప్పారు. ఈ ఎయిర్‌లైన్స్ రాకతో దేశీ విమానయాన రంగానికి ప్రయోజనం చేకూరగలదన్నారు. అటు, ఈ జేవీ విషయంలో ఎయిర్ఏషియా ఇండియా మరో ప్రమోటర్ అరుణ్ భాటియా అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలపై స్పంది స్తూ.. అలాంటి గందరగోళం లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. టాటా-ఎస్ఐఏ జేవీలో టాటా సన్స్‌కి 51%, ఎస్‌ఐఏకి 49% వాటాలు ఉంటాయి. ప్రారంభ దశలో ఇందులో ఇరు కంపెనీలు కలసి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే సంతోషమే: రతన్ టాటా ప్రభుత్వ రంగానికి చెందిన ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే మంచిదేనని రతన్ టాటా చెప్పారు. అదెప్పుడు జరిగినా తాను సంతోషిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎయిర్‌లైన్స్ వంటి వ్యాపార రంగాల్లో ఉండకూడదని, ఎయిరిండియాని ప్రైవేటీకరించే అవకాశాలను రాబోయే ప్రభుత్వాలు పరిశీలించగలవ ంటూ అజిత్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ప్రారంభించిన విమానయాన సంస్థే తర్వాత రోజుల్లో ఎయిరిండియాగా మారింది. -
భారత్ నియంత్రణలోనే టాటా ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: తాము ప్రారంభించనున్న విమానయాన సంస్థ ఎల్లవేళలా భారత చట్టాల నియంత్రణలోనే పనిచేస్తుందని ఒక సంయుక్త ప్రకటనలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ పేర్కొన్నాయి. ఈ వెంచర్ నిర్వహణ దేశీయ సంస్థ చేతిలోనే ఉంటుందని తెలిపాయి. టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ వెంచర్ ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగానూ విమానయాన సేవలను అందించేందుకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుమతించమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా దేశీయ నిర్వహణపై టాటా ఎస్ఐఏ తాజాగా వివరణ ఇచ్చింది. ఈ వెంచర్లో టాటా సన్స్‌కు 51%, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49% చొప్పున వాటా ఉంటుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్‌చేయనున్న 4.9 కోట్ల డాలర్లకుగాను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎఫ్ఐపీబీ అనుమతిని పొందాల్సి ఉంది. దీంతోపాటు ఈ వెంచర్‌కు డీజీఎఫ్టీ, డీజీసీఏ, సీబీఈసీ వంటి ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాల్సి ఉంది. అంతేకాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు సైతం తప్పనిసరి.