న్యూఢిల్లీ: విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో రహస్య చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్‌కుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమాచారం ఇచ్చింది.
టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ చర్చలు నడుస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేసిన తర్వాత.. అప్పటికే తమ నిర్వహణలోని విస్తారా, ఎయిరేషియా ఇండియా కార్యకలాపాలను ఒకే గొడుగు కింద కు తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఎయిర్ ఇండియా-విస్తారా విలీనంపై చర్చలు నడుస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఎయిరేషియా ఇండియాలో టాటాలకు 83.67 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment