
విమాన టాయిలెట్లో కిలో బంగారం
చెన్నై : సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న విమాన టాయిలెట్లో కిలో బంగారాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు చెన్నైకి చేరుకుంది. విమానాన్ని శుభ్రం చేసేందుకు లోనికి వెళ్లిన పారిశుధ్య సిబ్బంది టాయిలెట్‌లోకి వెళ్లి చూడ గా ఎరుపురంగు బ్యాగు దొరికింది.
అందులో రూ.30 లక్షల విలువ చేసే కిలో బరువున్న బం గారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు భయపడిన ప్రయాణికుడు ఎవరో టాయిలెట్‌లో వదిలేసినట్లు భావిస్తున్నారు.