plane toilet
-
విమానం టాయ్లెట్లో కిలోలకొద్ది బంగారం
చెన్నై : విమానం టాయిలెట్లో దాచి ఉంచిన రూ. రూ.2.24 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విమానం వెనక భాగంలోని టాయిలెట్లో నలుపు రంగులో నాలుగు ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 5.6 కిలోల బరువు ఉన్న 48 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బంగారం విలువ దాదాపు రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన ఆ విమానం.. అనంతరం సర్వీస్ నంబర్ మార్చుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. -
టాయిలెట్లో 5 కేజీల బంగారం
చెన్నై: మలేషియా నుంచి చెన్నైకి చేరుకున్న విమానం నుంచి ఐదు కిలోల బంగారును కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము 2.30గంటలకు కౌలాలంపూర్ నుంచి ఏయిర్ ఇండి యా విమానం చెన్నై విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందుగానే అధికారులకు సమాచారం రావడంతో ప్రయాణికులను మరింత తీవ్రంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే ఎవ్వరి వద్ద బంగారు దొరకలేదు. ఆ తరువాత విమానంలోని టాయిలెట్‌ను తనిఖీ చేయగా అక్కడి వాటర్‌ట్యాంక్‌లో నల్లని బ్యాగులో బంగారం దొరికింది. 500 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 కిలోల ఈ బంగారు విలువ ప్రపంచ మార్కెట్లో రూ.1.5 కోట్లుగా అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో తీవ్రస్థాయిలో తనిఖీలు సాగుతున్నట్లు గ్రహించిన ప్రయాణికుడు బంగారు ప్యాకెట్‌ను టాయిలెట్లో దాచి పారిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. -
విమానం టాయ్లెట్లో 8 కిలోల బంగారం సీజ్
ముంబై: విమానం టాయ్లెట్లలో దాచిని 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ముంబై విమానాశ్రయంలో అధికారులు 2 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేసి, అక్రమంగా రవాణ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబై-మస్కట్ విమానంలో కిలోల బరువున్న 8 బంగారు కడ్డీలను అక్రమ రవాణ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం వచ్చింది. ముంబై విమానాశ్రయంలో అధికారులు తనిఖీ చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణ చేస్తున్న సేగు నైనా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీటిని విమానంలోని రెండు టాయ్లెట్లలో డస్ట్బిన్లలో దాచాడు. -
విమాన టాయిలెట్లో కిలో బంగారం
చెన్నై : సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న విమాన టాయిలెట్లో కిలో బంగారాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు చెన్నైకి చేరుకుంది. విమానాన్ని శుభ్రం చేసేందుకు లోనికి వెళ్లిన పారిశుధ్య సిబ్బంది టాయిలెట్లోకి వెళ్లి చూడ గా ఎరుపురంగు బ్యాగు దొరికింది. అందులో రూ.30 లక్షల విలువ చేసే కిలో బరువున్న బం గారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు భయపడిన ప్రయాణికుడు ఎవరో టాయిలెట్లో వదిలేసినట్లు భావిస్తున్నారు. -
విమానం టాయ్లెట్లో 24 కిలోల బంగారం
కోల్‌కతా: విదేశాల నుంచి దేశంలోకి భారీస్థాయిలో అక్రమంగా తరలిస్తున్న బంగారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానం మరుగుదొడ్లో దాచిన 24 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7.22 కోట్లు ఉంటుందని వెల్లడించారు. సోమవారం రాత్రి నగరానికి చేరుకున్న విమానంలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బంది రెండు బ్యాగులు గుర్తించి అధికారులు సమాచారం అందించారు. తొలుత బాంబులుగా భావించిన అధికారులు బాంబు నిర్వీర్య దళాన్ని రంగంలోకి దింపారు. అనంతరం వాటిని తెరిచి చూడగా వాటిలో ఒక్కొక్కటీ కిలో బరువున్న 24 బంగారు బిస్కట్లు కనిపించాయి.