టాయిలెట్లో 5 కేజీల బంగారం
చెన్నై: మలేషియా నుంచి చెన్నైకి చేరుకున్న విమానం నుంచి ఐదు కిలోల బంగారును కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము 2.30గంటలకు కౌలాలంపూర్ నుంచి ఏయిర్ ఇండి యా విమానం చెన్నై విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందుగానే అధికారులకు సమాచారం రావడంతో ప్రయాణికులను మరింత తీవ్రంగా తనిఖీ చేయడం ప్రారంభించారు.
అయితే ఎవ్వరి వద్ద బంగారు దొరకలేదు. ఆ తరువాత విమానంలోని టాయిలెట్‌ను తనిఖీ చేయగా అక్కడి వాటర్‌ట్యాంక్‌లో నల్లని బ్యాగులో బంగారం దొరికింది. 500 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 కిలోల ఈ బంగారు విలువ ప్రపంచ మార్కెట్‌లో రూ.1.5 కోట్లుగా అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో తీవ్రస్థాయిలో తనిఖీలు సాగుతున్నట్లు గ్రహించిన ప్రయాణికుడు బంగారు ప్యాకెట్‌ను టాయిలెట్‌లో దాచి పారిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.