ముంబై: విమానం టాయ్లెట్లలో దాచిని 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ముంబై విమానాశ్రయంలో అధికారులు 2 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేసి, అక్రమంగా రవాణ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ముంబై-మస్కట్ విమానంలో కిలోల బరువున్న 8 బంగారు కడ్డీలను అక్రమ రవాణ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం వచ్చింది. ముంబై విమానాశ్రయంలో అధికారులు తనిఖీ చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణ చేస్తున్న సేగు నైనా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీటిని విమానంలోని రెండు టాయ్లెట్లలో డస్ట్బిన్లలో దాచాడు.
విమానం టాయ్లెట్లో 8 కిలోల బంగారం సీజ్
Published Sat, Jun 6 2015 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement