నోట్ల రద్దు : కుప్పకూలిన విమానయానం
నోట్ల రద్దు : కుప్పకూలిన విమానయానం
Published Thu, Nov 17 2016 11:48 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై భారీగా ఎఫెక్ట్ చూపుతోంది. ఈ ప్రభావంతో జోరుమీదున్న విమానరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. టిక్కెట్ బుకింగ్స్ లేక సీట్లను ఖాళీగా ఉండిపోతున్నాయి. ప్రయాణాలకు ఇది అత్యంత కీలకమైన సమయం కావడంతో ఖాళీగా ఉన్న సీట్లను నింపుకోవడానికి విమానయాన సంస్థలు స్పెషల్ స్కీమ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు హఠాత్తు పరిణామంతో ఇటు దేశీయంగానే కాక, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బుకింగ్ భారీగా దెబ్బతిన్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. లోకాస్ట్ ఎయిర్లైన్ పేరున్న సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన స్కూట్ సంస్థకు ఐలాండ్ నుంచి ఇండియాలోని జైపూర్, అమృత్సర్, చైన్నై ప్రాంతాలకు ఒక్కరోజు నమోదయ్యే బుకింగ్స్ 10 శాతం పడిపోయినట్టు ఆ సంస్థ భారత అధినేత భరత్ మహాదేవన్ తెలిపారు.
మంగళవారం అనంతరం తమ విమానయాన సంస్థకు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్లైన్కు చెందిన మరో బడ్జెట్ ఎయిర్లైన్ టైగర్ కూడా భారత్ నుంచి నమోదయ్యే టిక్కెట్ల బుకింగ్స్ ఒక్కరోజుకు 10 శాతం పడిపోయాయని తెలిసింది. ఫిబ్రవరి నుంచి ప్రమోషనల్ రేట్లను ఆఫర్ చేయాలని తాము భావిస్తున్నామని, కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్తో ట్రావెల్ డిమాండ్ దారుణంగా పతనమైందని పేర్కొంది. దీంతో డిసెంబర్ నుంచే ఈ ఆఫర్లు ప్రారంభిస్తామని మహదేవన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో విదేశీలకు ప్రయాణించే వారి లగ్జరీ ట్రావెల్ డిమాండ్ తగ్గినట్టు ఇంటర్నేషనల్ ట్రావెల్ పోర్టల్ తెలిపింది. చిన్న పట్టణాల్లో నివసించే వారు నగదు రూపంలోనే టిక్కెట్ చెల్లింపులు చేస్తారని, ప్రస్తుతం అది వీలుపడటం లేదని అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement