special schemes
-
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
కుటుంబమే ముఖ్యం: రజనీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎవరికైనా చేస్తున్న వృత్తి, రాజకీయాల కన్నా తల్లిదం డ్రులు, కుటుంబమే ముఖ్యమని సినీ నటుడు రజనీకాంత్ అన్నారు. తన రాజకీయ ప్రవేశంపై మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని సూచించారు. అభిమానులతో వరసగా రెండో రోజు సమావేశమవడానికి బయల్దేరే ముందు బుధవారం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తున్నారా? తమిళనాడు కోసం ఏమైనా ప్రత్యేక పథకాలు సిద్ధం చేశారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘4 రోజులు ఓపిక పట్టండి, 31వ తేదీన అన్నీ చెబుతాను’ అని సమాధానమిచ్చి వెళ్లిపోయారు. నాలుగు జిల్లాల అభిమానులతో జరిగిన సమావేశంలో... రాజకీయాల్లోకి రావాలని ఒకరు కోరగా, రజనీ మాట్లాడుతూ మనకు అన్నిటి కన్నా తల్లిదండ్రులు, కుటుంబమే ముఖ్యమన్నారు. -
సమరానికి సై
అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ప్రధాన ప్రతి పక్షంతో పాటు కాంగ్రెస్ ఉరకలు వేస్తోంది. ఇక, ప్రప్రథమంగా సభలో బడ్జెట్ దాఖలుకు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ సిద్ధమయ్యారు. అలాగే,ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా స్పీకర్‌పై అవిశ్వాసానికి డీఎంకే కసరత్తుల్లో పడింది. సాక్షి, చెన్నై: 2017–18 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులే చేసింది. ఈ బడ్జెట్ అటు సీఎం ఏడపాడి పళనిస్వామికి, ఆర్థిక మంత్రి జయకుమార్‌లకు కొత్తే. ఈ ఇద్దరు ఆ పదవులకు ప్రప్రథమంగా ఎంపికైన వారే. ఈ దృష్ట్యా, ప్రభుత్వం దాఖలు చేయనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఎదురు చూపులు పెరిగా యి. అమ్మ జయలలిత మరణం తదుపరి దాఖ లు చేస్తున్న బడ్జెట్ పాలకులకు పెను సవాలే. ప్రజాకర్షణ లక్ష్యంగా ముందుకు సాగాలంటే, ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు, ప్రత్యేక పథకాలు తప్పనిసరి. అయి తే, వీటి కి నిధుల కొరత తాండవం చేస్తుండడంతో తాజా బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతోండడాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. అలాగే, తన పాలనా దక్షతను చాటుకునేందుకు ఈ బడ్జెట్‌ను పళనిస్వామి కీలకంగా భావించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త భారాన్ని మోపుతారా, లేదా ప్రజల నెత్తిన భారం పడకుండా, కొత్త పథకాలతో ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తారా అన్నది ఈ బడ్జెట్లో తేలనుంది. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సభ ప్రారంభం కాగానే, బడ్జెట్‌ను జయకుమార్ దాఖలు చేయనున్నారు. అవిశ్వాసానికి కసరత్తు: బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం అవుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి, సభ ఎన్ని రోజులు సాగించాలన్న విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఇందులో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు తగ్గ కసరత్తుల్లో డీఎంకే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ తీరుపై డీఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సమావేశాల్లో ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక, హైడ్రో కార్బన్ తవ్వకాలు, జాలర్లపై దాడులు, శాంతి భద్రతల విఘాతం, రేషన్ కొరత, వంటి అంశాలను అస్త్రంగా చేసుకుని పాలకులతో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, కాంగ్రెస్‌లు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐదు రోజులకు పరిమితం: బడ్జెట్ సమావేశానికి ఐదు రోజులకు పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బడ్జెట్ దాఖలు, తదుపరి చర్చలకు ఐదు రోజులు అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 23వ తేదీ వరకు సభను పరిమితం చేసి, తదుపరి ఏప్రిల్ 18 తర్వాత శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చలు సాగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందుకు కారణం ఆర్కేనగర్ ఉప ఎ న్నికలే. డీఎంకే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన పక్షంలో చర్చ, ఓటింగ్ వారం రోజుల తదుపరి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమరం వాడివేడిగా సాగే అవకాశాలు ఉండడంతో, సచివాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయంలోకి వాహనాల రాకపోకలకు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధించారు. ప్రతిపక్షాన్ని ఢీకొట్టండి: బడ్జెట్ సమావేశాల్లో తమ మీద సమరం సాగించేందుకు, ప్రభుత్వా న్ని కూల్చడం లక్ష్యంగా అవిశ్వాస తీర్మానానికి డీఎంకే సిద్ధం అవుతున్న సంకేతాలతో అన్నాడీఎంకే మేల్కొంది. ఆగమేఘాలపై పార్టీ ఎమ్మెల్యేలను చెన్నైకు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పిలిపించారు. శాసన సభా పక్ష సభ్యులందరితో భేటీ అయ్యారు. ప్రతి పక్ష వ్యూహాలు, కుట్రల్ని భగ్నం చేసే విధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మీద గెలిచిన ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు సమాచారం. -
కౌలు రైతులకు ప్రత్యేక పథకాలు రూపొందించాలి
ఒంగోలు టౌన్: కౌలు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆచార్య రావూరి వీరరాఘవయ్య సూచించారు. సామాజిక పరిణామ పరిశోధన సంస్థ(రైజ్) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మల్లయ్య లింగం భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చినా అవి వారికి ఉపయోగపడటం లేదన్నారు. రైజ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. ప్రసాదరావు మాట్లాడుతూ ఫ్రామ్ పేరుతో డీఎంఆర్ శేఖర్ కనిపెట్టిన ఎరువు డీఏపీ కంటే చౌకగా ఉంటుందన్నారు. దీనిని రైతులకు చేరవేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. రైతు నాయకుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పాలకులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఇఫ్కో సంస్థకు వ్యవసాయ భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో భూసేకరణ ద్వారా ప్రభుత్వం పేద నిర్వాసితుల పొట్టను కొడుతుందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ద్రోహపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం గౌరవాధ్యక్షుడు షంషీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాలుగా ఉండాల్సిన ప్రభుత్వాలు భక్షకులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సులో రైజ్ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు, సభ్యులు యూఆర్ ఆనంద్ పాల్గొన్నారు. ఆచార్య రావూరి వీరరాఘవయ్యకు డీటీ మోజస్ అవార్డుతోపాటు రూ.25వేల నగదును ఇందిరా శేఖర్ ట్రస్ట్ తరఫున డీఎంఆర్ శేఖర్, ఇందిరాశేఖర్ సంయుక్తంగా అందజేశారు. -
నోట్ల రద్దు : కుప్పకూలిన విమానయానం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై భారీగా ఎఫెక్ట్ చూపుతోంది. ఈ ప్రభావంతో జోరుమీదున్న విమానరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. టిక్కెట్ బుకింగ్స్ లేక సీట్లను ఖాళీగా ఉండిపోతున్నాయి. ప్రయాణాలకు ఇది అత్యంత కీలకమైన సమయం కావడంతో ఖాళీగా ఉన్న సీట్లను నింపుకోవడానికి విమానయాన సంస్థలు స్పెషల్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు హఠాత్తు పరిణామంతో ఇటు దేశీయంగానే కాక, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బుకింగ్ భారీగా దెబ్బతిన్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. లోకాస్ట్ ఎయిర్‌లైన్ పేరున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్కూట్ సంస్థకు ఐలాండ్ నుంచి ఇండియాలోని జైపూర్, అమృత్సర్, చైన్నై ప్రాంతాలకు ఒక్కరోజు నమోదయ్యే బుకింగ్స్ 10 శాతం పడిపోయినట్టు ఆ సంస్థ భారత అధినేత భరత్ మహాదేవన్ తెలిపారు. మంగళవారం అనంతరం తమ విమానయాన సంస్థకు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్‌కు చెందిన మరో బడ్జెట్ ఎయిర్‌లైన్ టైగర్ కూడా భారత్ నుంచి నమోదయ్యే టిక్కెట్ల బుకింగ్స్ ఒక్కరోజుకు 10 శాతం పడిపోయాయని తెలిసింది. ఫిబ్రవరి నుంచి ప్రమోషనల్ రేట్లను ఆఫర్ చేయాలని తాము భావిస్తున్నామని, కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ట్రావెల్ డిమాండ్ దారుణంగా పతనమైందని పేర్కొంది. దీంతో డిసెంబర్ నుంచే ఈ ఆఫర్లు ప్రారంభిస్తామని మహదేవన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో విదేశీలకు ప్రయాణించే వారి లగ్జరీ ట్రావెల్ డిమాండ్ తగ్గినట్టు ఇంటర్నేషనల్ ట్రావెల్ పోర్టల్ తెలిపింది. చిన్న పట్టణాల్లో నివసించే వారు నగదు రూపంలోనే టిక్కెట్ చెల్లింపులు చేస్తారని, ప్రస్తుతం అది వీలుపడటం లేదని అధికారులు పేర్కొన్నారు. -
వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక పథకాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: వ్యవసాయరంగ అభివృద్ధి కో సం ఆంధ్రాబ్యాంక్ అనేక పథకాలను ప్రవేశపెడుతుందని బ్యాంక్ జోనల్ డీ జీఎం నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జోనల్ కార్యాలయంలో రైతులకు ఆంధ్రాబ్యాంక్ ‘కిసాన్ వాణి’ పథకం కింద గ్రీన్సిమ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రై తులకు వ్యవసాయ, అనుబంధ రం గాల్లో ఆధునిక సాంకేతిక సమాచారం అందించేందుకు ‘ఇస్కో కిసాన్ సంచార్ లిమిటెడ్’ గ్రీన్ సిమ్ ద్వారా ఆంధ్రాబ్యాంక్ కిసాన్ వాణి సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు నిరంతరాయం గా అందించేందుకు ఇస్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలి పారు. దేశ బ్యాంకింగ్ రంగంలో రైతులకు ఇలాంటి సౌకర్యం కల్పించడం ఇదే ప్రథమమన్నారు. వాతావరణ పరి స్థితులు, మెరుగైన సేద్య పద్ధతులు, రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణ సౌకర్యాలు, మార్కెట్ ధరలపై సరైన అవగాహన కల్పించేందుకు కిసాన్ వాణి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులకు ఈ గ్రీన్ సిమ్‌లు ఒక్కొక్కటి రూ.86లకు బ్యాంక్ నిర్దేశించిన రైతు సేవా సంఘాల్లో లభిస్తాయని అన్నారు. సిమ్ కార్డుతోపాటు రూ.82ల టాక్‌టైమ్ ఉంటుందన్నారు.