వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ఆంధ్రాబ్యాంక్ అనేక పథకాలను ప్రవేశపెడుతుందని ...
స్టేషన్ మహబూబ్‌నగర్: వ్యవసాయరంగ అభివృద్ధి కో సం ఆంధ్రాబ్యాంక్ అనేక పథకాలను ప్రవేశపెడుతుందని బ్యాంక్ జోనల్ డీ జీఎం నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జోనల్ కార్యాలయంలో రైతులకు ఆంధ్రాబ్యాంక్ ‘కిసాన్ వాణి’ పథకం కింద గ్రీన్‌సిమ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రై తులకు వ్యవసాయ, అనుబంధ రం గాల్లో ఆధునిక సాంకేతిక సమాచారం అందించేందుకు ‘ఇస్కో కిసాన్ సంచార్ లిమిటెడ్’ గ్రీన్ సిమ్ ద్వారా ఆంధ్రాబ్యాంక్ కిసాన్ వాణి సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సౌకర్యాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు నిరంతరాయం గా అందించేందుకు ఇస్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలి పారు. దేశ బ్యాంకింగ్ రంగంలో రైతులకు ఇలాంటి సౌకర్యం కల్పించడం ఇదే ప్రథమమన్నారు. వాతావరణ పరి స్థితులు, మెరుగైన సేద్య పద్ధతులు, రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణ సౌకర్యాలు, మార్కెట్ ధరలపై సరైన అవగాహన కల్పించేందుకు కిసాన్ వాణి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులకు ఈ గ్రీన్ సిమ్‌లు ఒక్కొక్కటి రూ.86లకు బ్యాంక్ నిర్దేశించిన రైతు సేవా సంఘాల్లో లభిస్తాయని అన్నారు. సిమ్ కార్డుతోపాటు రూ.82ల టాక్‌టైమ్ ఉంటుందన్నారు.