
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎవరికైనా చేస్తున్న వృత్తి, రాజకీయాల కన్నా తల్లిదం డ్రులు, కుటుంబమే ముఖ్యమని సినీ నటుడు రజనీకాంత్ అన్నారు. తన రాజకీయ ప్రవేశంపై మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని సూచించారు. అభిమానులతో వరసగా రెండో రోజు సమావేశమవడానికి బయల్దేరే ముందు బుధవారం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి వస్తున్నారా? తమిళనాడు కోసం ఏమైనా ప్రత్యేక పథకాలు సిద్ధం చేశారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘4 రోజులు ఓపిక పట్టండి, 31వ తేదీన అన్నీ చెబుతాను’ అని సమాధానమిచ్చి వెళ్లిపోయారు. నాలుగు జిల్లాల అభిమానులతో జరిగిన సమావేశంలో... రాజకీయాల్లోకి రావాలని ఒకరు కోరగా, రజనీ మాట్లాడుతూ మనకు అన్నిటి కన్నా తల్లిదండ్రులు, కుటుంబమే ముఖ్యమన్నారు.