రన్వేపై కూలిన విమానం.. | Singapore Airlines jet collapses during checks; no injuries | Sakshi
Sakshi News home page

రన్వేపై కూలిన విమానం..

Published Sun, Oct 11 2015 5:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

రన్వేపై కూలిన విమానం..

రన్వేపై కూలిన విమానం..

రన్ వేపై ల్యాండ్ అవుతోన్న సమయంలో జెట్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణికులుగానీ, సిబ్బందిగానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన సింగపూర్ లోని చంగి ఎయిర్ పోర్టులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఎయిర్ బస్ ఏ330-300 జెట్ విమానం.. ఉదయం 7:35 గంటలకు హాంకాంగ్ వెళ్లాల్సిఉంది. షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి  తెల్లవారుజామున సింగపూర్ కు చేరుకున్న ఈ విమానానికి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ఆ సమయంలో లోపల ఒక ఇంజనీర్ మాత్రమే ఉన్నాడని, అతనికి కూడా ఎలాంటిగాయాలు కాలేదని, విమానం ముందుభాగం దెబ్బదినట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement