గుజరాత్‌ బుల్లెట్‌ ప్రాజెక్టులో అపశృతి | Under construction bullet train bridge collapses in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ బుల్లెట్‌ ప్రాజెక్టులో అపశృతి

Published Tue, Nov 5 2024 8:58 PM | Last Updated on Tue, Nov 5 2024 9:05 PM

Under construction bullet train bridge collapses in Gujarat

అహ్మాదాబాద్‌: గుజరాత్‌లోని బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్‌ జిల్లా వసాద్‌ దగ్గర పిల్లర్లు కూలిపోయాయి. ఆకస్మికంగా పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదంలో  శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐరన్‌ బీమ్‌ కూలిపోవడంతో 3-4 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించామని ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని చెప్పారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement