జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఇంటి రెండో ఫ్లోర్ కూలి.. | Floor Balcony Collapses During Rath Yatra In Ahmedabad One Dead | Sakshi
Sakshi News home page

జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఇంటి రెండో ఫ్లోర్ కూలి..

Published Tue, Jun 20 2023 9:02 PM | Last Updated on Tue, Jun 20 2023 9:16 PM

Floor Balcony Collapses During Rath Yatra In Ahmedabad One Dead - Sakshi

గుజరాత్‌: గుజరాత్‌లో జరిగిన  జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్ర కొనసాగుతుండగా.. పక్కనే ఉన్న శిథిలమైన ఇంటి రెండో ఫ్లోర్ బాల్కనీ కూలింది. ఈ ఘటనలో ఓ వ‍్యక్తి మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్‌లోని దరియాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 

146వ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులతో రహదారి కిక్కిరిసిపోయింది. రోడ్డు వెంట ఉన్న ఇళ్లలోని బాల్కనీల నుంచి భక్తులు రథయాత్రను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ శిథిలమైన ఇంటి రెండో ఫ్లోర్‌ బాల్కనీ అకస్మాత్తుగా కూలింది. దానిపై నిలుచుని ఉన్నవారు ఒక్కసారిగా కిందపడిపోయారు. కొన్ని శిథిలాలు రహదారిపై ఉన్న భక్తులపై పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. రథయాత్రకు సంబంధించి అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారని వెల్లడించారు. భవనం చాలా కాలం క్రితం నిర్మించినందున శిథిలమైపోయిందని పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: డెలివరీ బాయ్‌ మృతి.. బైకును ఢీకొట్టి వంద మీటర్లు లాకెళ్లిన కారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement