rath yatra
-
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర (ఫోటోలు)
-
స్వర్ణ రథంపై దివ్యతేజం
మంత్రాలయం: స్వర్ణరథంపై శ్రీరాఘవేంద్ర స్వామి దివ్యతేజస్సును దర్శించుకున్న భక్తజనం తన్మయత్వంలో మునిగిపోయింది. పోటెత్తిన భక్తజనంతో శ్రీమఠం కిటకిటలాడింది. భువన మోహనుడి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన అత్యంత వైభవంగా సాగింది. రాఘవేంద్ర స్వామి సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం కావడంతో వేడుకలు వెలుగులీనాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు రాయరు మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. రెండుగంటల పాాటు ఎంతో వైభవంగా అభిషేక క్రతువు సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన పట్టువ్రస్తాలు, సుమమాలలతో సుందరంగా బృందావనాన్ని అలంకరించారు. అనంతరం శ్రీరాఘవేంద్రుడి బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. అశేష భక్తజనుల హర్షధ్వానాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. టీటీడీ పట్టు వ్రస్తాల సమర్పణ ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామికి పట్టు వ్రస్తాలను టీటీడీ జేఈవో వీరబ్రహ్మేంద్ర సమర్పించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పట్టు వ్రస్తాలను శాస్త్రోక్తంగా స్వీకరించి శిరస్సున ఉంచుకుని ప్రాంగణ వీధుల్లో ఊరేగారు. ఊంజల మంటపంలో పీఠాధిపతిని టీటీడీ అధికారులు సత్కరించారు. అనంతరం పట్టు వ్రస్తాలను రాఘవేంద్రుల మూల బృందావనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యారాధన వేడుకలకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీశానంద, కన్నడ సినీ నటుడు జగ్గేష్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి 30 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు. -
త్రిపురలో విషాదం.. రథానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో
త్రిపురలో విషాదం చోటు చేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్ వద్ద ఇనుముతో చేసిన జగాన్నథ రథం ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రథానికి విద్యుత్ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రథయాత్ర పండగ జూన్ 20న ప్రారంభమవ్వగా.. ఉత్సవాల ముగింపులో భాగమైన ‘ఉల్టా రథ్’ ఊరేగింపులో జగన్నాథ బారి ఆలయానికి వస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. -
జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఇంటి రెండో ఫ్లోర్ కూలి..
గుజరాత్: గుజరాత్లో జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్ర కొనసాగుతుండగా.. పక్కనే ఉన్న శిథిలమైన ఇంటి రెండో ఫ్లోర్ బాల్కనీ కూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్‌లోని దరియాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 146వ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులతో రహదారి కిక్కిరిసిపోయింది. రోడ్డు వెంట ఉన్న ఇళ్లలోని బాల్కనీల నుంచి భక్తులు రథయాత్రను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ శిథిలమైన ఇంటి రెండో ఫ్లోర్ బాల్కనీ అకస్మాత్తుగా కూలింది. దానిపై నిలుచుని ఉన్నవారు ఒక్కసారిగా కిందపడిపోయారు. కొన్ని శిథిలాలు రహదారిపై ఉన్న భక్తులపై పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. రథయాత్రకు సంబంధించి అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారని వెల్లడించారు. భవనం చాలా కాలం క్రితం నిర్మించినందున శిథిలమైపోయిందని పేర్కొన్నారు. Accident during Rath Yatra in Ahmedabad, many injured due to balcony collapse #Ahmedabad #WhatsApp #AhmedabadRathYatra pic.twitter.com/Efi4zUW077 — Pawan Shandilya (@pawanshandilya8) June 20, 2023 ఇదీ చదవండి: డెలివరీ బాయ్ మృతి.. బైకును ఢీకొట్టి వంద మీటర్లు లాకెళ్లిన కారు -
యాత్ర.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నుండే వెళుతుంది అంతేగా సార్!
యాత్ర.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నుండే వెళుతుంది అంతేగా సార్! -
నేడు జగన్నాథుని రథయాత్ర.. వారికి నో ఎంట్రీ
సాక్షి, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. శ్రీమందిరం నుంచి గుండిచామందిరం వరకు సాగే ఈ యాత్రలో బొడొదండొ దారి పొడవునా బలభద్ర, సుభద్ర, జగ న్నాథుని రథాలను లాగే గొప్ప కార్యక్రమం చోటుచేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల దృష్ట్యా గతేడాది తరహాలో లాగే ఈసారి కూడా యాత్రకు భక్తులకు ప్రవేశం నిషేధిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. సింహద్వారం ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది పరిమితమైన సిబ్బంది, సేవాయత్‌లతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే యాత్రలో పాల్గొనే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అంతకుముందే ఆయా వర్గాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేశారు. పోలీస్ సిబ్బంది, సేవాయత్‌లు మినహాయిస్తే యాత్ర కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు దాదాపు 1000 మంది అధికారులు వరకు అందుబాటులో ఉంటారని పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ వర్మ తెలిపారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు అనుగుణంగా రథాలను లాగేందుకు సేవాయత్‌లు, పోలీసులను మాత్రమే నియమించారు. ఈ క్రమంలో ఒక్కోరథం లాగేందుకు గరిష్టంగా 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు. యాత్రా స్థలంలో మోహరించిన భద్రతా బలగాలు భద్రత కట్టుదిట్టం.. కరోనా కట్టడిలో భాగంగా యాత్రలో జనసమూహం నివారణకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీ జిల్లా రైల్వేస్టేషన్‌ని చేరుకునే రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పాటు పట్టణంలో కర్ఫ్యూ విధించి, పట్టణ సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల వారి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, రథయాత్ర ఏర్పాట్లను ఆదివారం సమీక్షించిన అదనపు డీజీపీ ఆర్.కె.శర్మ మాట్లాడుతూ పూరీ పట్టణాన్ని 12 జోన్లుగా విభజించి, 65 ప్లాటూన్ల పోలీస్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. భద్రతా బలగాల్లో 10 మంది అదనపు పోలీస్ సూపరింటెండెంట్లు, 31 మంది డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు, 64 మంది ఇన్స్పెక్టర్లు, 222 మంది సహాయ సబ్–ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్‌స్పెక్టర్లుని నియమించినట్లు పూరీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె.వి.సింఘ్ తెలిపారు. నందిఘోష్ రథం వద్దకు ఆజ్ఞామాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఆజ్ఞామాలలతో పూజలు.. రథ నిర్మాణ శాల శ్రీమందిరం ఆవరణకు చేర్చిన జగన్నాథ, సుభద్ర, బలభద్రుని రథాలకు మూలవిరాట్ల దగ్గరి నుంచి బాజాభజంత్రీలు, మేళతా ళాలు, ఘంటానాదంతో తీసుకువచ్చిన ఆజ్ఞామాలలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోవర్థన పీఠాధిపతి, ఆదిశంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆలయ సంప్రదాయ రీతిలో అధికారిక పిలుపు చేశారు. రథాలపై యాత్రకు ఆసీనులైన మూలవిరాట్లను తొలుత ఆదిశంకరాచార్యులు ప్రత్యక్షంగా దర్శించుకుని, స్వామి తొలి దర్శనం స్వీకరిస్తారు. సూక్ష్మ రథాలు.. సూపర్! జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని, నగరంలోని శ్రీరామ్‌నగర్‌కి చెందిన ప్రముఖ శిల్పి హరగోవింద మహరణ తన కళా నైపుణ్యం ఉపయోగించి, బియ్యం, గోదుమలతో తయారు చేసిన బలభద్ర, సుభద్ర, జగన్నాథుని సూక్ష్మ రథాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజుకు మూడు గంటలు చొప్పున కష్టపడగా, వారం రోజుల్లో ఇవి పూర్తయినట్లు సమాచారం. – బరంపురం -
మమత సర్కారుకు టాటా
నవద్వీప్/మాల్డా: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన శనివారం బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని నవద్వీప్ నుంచి పరివర్తన్ యాత్ర (రథయాత్ర)ను ప్రారంభించారు. బెంగాల్లో మార్పునకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో తృణమూల్ ప్రభుత్వం పరిపాలనను రాజకీయంగా, పోలీసు వ్యవస్థను నేరమయంగా, అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చేసిందని దుయ్యబట్టారు. మా, మాటీ, మానుష్(తల్లి, భూమి, ప్రజలు) అనే తృణమూల్ నినాదం కనుమరుగైందన్నారు. తల్లిని అగౌరవపర్చారని, భూమిని లూటీ చేశారని, ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారన్నారు. బెంగాల్లో దౌర్జన్య పాలన ‘జైశ్రీరామ్’ నినాదంలో తప్పేముందని నడ్డా ప్రశ్నించారు. ఈ నినాదాన్ని మమతా బెనర్జీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత దేశ సంస్కృతితో అనుసంధానం కావడం తప్పు ఎలా అవుతుందన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సంస్కృతిని నిరాకరిస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందని మండిపడ్డారు. 130 మంది బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని, తనపైనా జరిగిందని వెల్లడించారు. బెంగాల్ రైతులకు తీరని ద్రోహం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయకుండా మమత ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ద్రోహం చేసిందని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాల్డాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషక్ సురక్ష అభియాన్, ఏక్ ముట్టీ చావల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్ షోలో పాలుపంచుకున్నారు. రైతన్నల సంక్షేమానికి బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు. రైతులు తాము పండించిన పంటలకు పెట్టబడి వ్యయం కంటే 1.5 శాతం అధిక ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవలే 100వ కిసాన్ రైలును ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ రైళ్లలో రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చని వెల్లడించారు. ‘జైశ్రీరామ్’ అంటే కోపమెందుకో? మమత సర్కార్, టీఎంసీకిæ ప్రజలు ‘నమస్తే, టాటా’ చెప్పబోతున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్’ నినాదాలు వినగానే మమతా బెనర్జీకి ఎందుకు కోపం వస్తోందో అర్థం కావడం లేదన్నారు. మాల్డా జిల్లాలోని షాహాపూర్ గ్రామంలో ‘కృషక్ సురక్ష సహ–భోజ్’లో భాగంగా నడ్డా స్థానిక రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
రథయాత్ర వర్సెస్ బైక్ ర్యాలీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో వచ్చే ఏప్రిల్/మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ పదేళ్ల పాలనకు చెక్ పెట్టే లక్ష్యంతో బీజేపీ శనివారం నుంచి రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా మరో దఫా రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. నడియా జిల్లాలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జనసమర్థన్ యాత్ర పేరుతో సాగే ఈ ర్యాలీలో వేలాది మోటారుసైకిళ్లపై పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. అదేవిధంగా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం నడియాలో పరివర్తన్ రథ యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు దశల్లో ఈ యాత్ర, మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగాల్‌కు కేంద్ర బలగాలను పంపండి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు, ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని కాపాడేందుకు ఆ రాష్ట్రానికి కేంద్ర బలగాలను మాత్రమే పంపాలని బీజేపీ కోరింది. బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. కేంద్ర ఎన్నికల పరిశీలకులకు రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం విధుల పర్యవేక్షణ బాధ్యతలనుఅప్పగించాలంది. -
బెంగాల్లో రథయాత్రకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో పట్టు పెంచుకోవాలన్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సామాజిక సమతూకం దెబ్బతింటుందని పేర్కొంటూ బెంగాల్లో రథయాత్రల నిర్వహణకు సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చని, ఈ దిశగా రాష్ట్ర అధికారుల నుంచి తాజా అనుమతులు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది. సుప్రీం కోర్టు తన ఉత్తర్వులు జారీ చేస్తూ బెంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు నిర్వహించదలిస్తే సవరించిన యాత్ర ప్రణాళికలతో వాటికి తిరిగి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సవరించిన రథయాత్ర షెడ్యూల్‌ను అధికారులకు సమర్పించి అవసరమైన అనుమతులు కోరాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ బీజేపీ రాష్ట్ర శాఖను కోరింది. భావప్రకటనా హక్కును దృష్టిలో ఉంచుకుని రథయాత్ర కోసం బీజేపీ దాఖలు చేసిన దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.కాగా బీజేపీ రథయాత్రలకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ
-
రథయాత్ర అనుమతి కోసం సుప్రీంకు బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో రథయాత్రకు అనుమతి కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. తమ పార్టీ రథయాత్రకు అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బీజేపీ అప్పీల్ చేసుకుందని సుప్రీం కోర్టు అధికారిక రిజిస్ట్రీ పేర్కొంది. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. కాగా తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టుకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావించింది. ఈ రథయాత్రకు పార్టీ చీఫ్ అమిత్ షా పచ్చజెండా ఊపేలా సన్నాహాలు జరిపింది. యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. రథయాత్ర చేపట్టదలచిన ప్రాంతాలు అత్యంత సున్నితమైనవని, మత కలహాలకు ఆస్కారం ఉన్నందున అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపికి అనుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించినా. డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేయడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది. -
పశ్చిమబెంగాల్లో బీజేపీ రథయాత్రకు మళ్లీ బ్రేక్
-
ఇక శబరిమల కోసం ‘రథయాత్ర’
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించడంపై బీజేపీ నిరసన గళం మరింత పెంచింది. అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలనే నినాదంతో రథయాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. అయ్యప్ప భక్తుల నిరసనలకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడిన మరునాడే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఎన్డీఏ పక్షాల మద్దతుతో నవంబర్ 8 నుంచి కాసర్గోడ్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర నవంబర్ 13న పత్తనంతిట్టలో ముగియనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తెలిపారు. కాగా, శనివారం రాత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్, ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు, కేపీసీసీ సభ్యుడు రామన్ నాయర్ బీజేపీలో చేరారు. -
రథయాత్రపై నిర్ణయం చెప్పండి
సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఈనెల 31న హైదరాబాద్‌లో తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు అనుమతినిచ్చే విషయంలో తగిన నిర్ణయం తెలుపాలని హైకోర్టు గురువారం హైదరాబాద్ సిటీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రథయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వీహెచ్‌పీ తెలంగాణ కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనుమతినివ్వాలని పోలీసులను ఆదేశించేందుకు నిరాకరిస్తూ సింగిల్‌జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై గాల్‌రెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, శ్రీరామ రథయాత్రకు అనుమతి కోరుతూ తాజాగా దరఖాస్తు చేసుకుంటామని, అనుమతినిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
యువతి వీరంగం
రథయాత్ర సందర్భంగా రథాలపైకి ఎక్కి మూలవిరాట్లను స్పృశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.. మూలవిరాట్ల స్పర్శ వివాదాల మయం కావడంతో దీనిని పూర్తిగా నివారించాలని అధికారులు భావించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు మూల విరాట్లను స్పృశించడాన్ని నిషేధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విదేశంలో నివసిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని జైలుపాలుచేశారు.. కానీ అంతకుముందు, తర్వాత యథేచ్ఛగా స్పృశించినా చర్యలు తీసుకోలేదు.. స్వామివారి సన్నిధిలో ఉండే సేవాయత్‌లే అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.. పూరీ/భువనేశ్వర్: మూల విరాట్ల స్పర్శ వివాదం రథయాత్రతో ముడిపడి ఉంది. సంప్రదాయబద్ధంగా రథయాత్ర ముగిసినా స్పర్శ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆది వారం నిర్వహించిన నీలాద్రి విజేతో ఈ యాత్రకు తెర పడింది. మూల విరాట్లు శ్రీ మందిరం రత్న వేదికకు సురక్షితంగా చేరాయి. రథాల పైకి వెళ్లడం, మూల విరాట్లుని స్పర్శించడం నిషేధించినట్లు శ్రీ మందిరం దేవస్థానం ప్రకటించింది. ఒడిశా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఆదేశాల్ని జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది. అధికారుల ఆదేశాలను సేవాయత్‌లు ఉల్లంఘించినా పట్టించుకోని యంత్రాంగం సామాన్యులను మాత్రం వేధిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది రథ యాత్ర తొలి ఘట్టం స్నాన పూర్ణిమ నుంచి మూల విరాట్లుని స్పర్శిస్తున్నట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సేవాయత్‌ల ప్రేరణతో పలువురు అనధికారిక వ్యక్తులు స్నాన మండపంపై మూల విరాట్లుని స్పర్శించినట్లు వచ్చిన ఆరోపణల్ని శ్రీమందిరం ప్రధాన పాలనాధికారి సీఏఓ పరోక్షంగా ఖండించి సేవాయత్లకు అండగా నిలిచి హై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలో సేవాయత్ వర్గాల్ని ప్రోత్సహించినట్లు నీలాద్రి విజే ఘట్టం రుజువు చేసింది. రథ యాత్రలో నీలాద్రి విజే చిట్ట చివరి ఘట్టం. రథాలపై నుంచి మూల విరాట్లుని వరుస క్రమంలో (గొట్టి పొహొండి) దించి శ్రీ మందిరం రత్న వేదికపై యథా తథంగా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియకు కాసేపటి ముందుగానే సేవాయత్ వర్గాల కుటుంబీకులు పిల్లాపాపలతో రథాలపైకి వెళ్లి మూల విరాట్లను బాహాటంగా స్పర్శించారు. శ్రీ మందిరం ప్రధాన పాలనాధికారి సీఏఓ, జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు వంటి అతిరథ మహారథుల సమక్షంలో జరిగినా ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. అధికారుల మద్దతుతోనే? సేవాయత్‌ల ఆగడాలకు శ్రీ మందిరం దేవస్థానం అధికార యంత్రాంగం మద్దతుగా నిలుస్తుందని ఈ వ్యవహారం స్పష్టం చేసింది. గుండిచా మందిరం ఆవరణలో రథాలు ఉండగా సేవాయత్ కుటుంబీకులు రథంపైకి వెళ్లి మూల విరాట్లుని స్పర్శించిన సందర్భంలో దేవస్థానం అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోలేదు. మర్నాడు రథాలపైకి వెళ్లిన ప్రవాస భారతీయుడు (ఒడియావాసి)పై చట్టపరమైన ఉత్తర్వుల ఉల్లంఘన నేరం కింద అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో సేవాయత్ కుటుంబీకుల వ్యవహారంలో పెదవి కదపకపోవడం ఏమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి విజే ఉత్సవం జరుగుతుండగా సేవాయత్ కుటుంబీకులు రథాలపైకి వెళ్లడంతో గొట్టి పొహొండి తీవ్రంగా ప్రభావితం అయింది. నీలాద్రి విజే దాదాపు ఆది వారం రాత్రంతా జరిపించాల్సి వచ్చింది. తెల్లారితే సోమ వారం అనగా నీలాద్రి విజేని అతి కష్టం మీద ముగిించాల్సి రావడం విచారకరం. కలెక్టరు బదిలీకి సేవాయత్‌ల డిమాండు నీలాద్రి విజే ఉత్సవంలో బలభద్రుని రథం తాళ ధ్వజంపైకి సేవాయత్ తన కుమార్తెని తీసుకు వెళ్లి మూల విరాట్లుకు స్పర్శింపజేశారు. అశేష జన సమూహం సమక్షంలో ఈ తప్పిదానికి బాహాటంగా పాల్పడిన సేవాయత్ని అధికార యంత్రాంగం నిలదీయడంతో జిల్లా కలెక్టరుని ఇక్కడ నుంచి బదిలీ చేయాలని తక్షణమే ఆందోళనని ప్రేరేపించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సాహు సమక్షంలో ఈ రగడ చోటుచేసుకుంది. అధికారులు, సేవాయత్‌ల మధ్య రగడం పుంజుకోవడంతో గొట్టి పొహొండి తంతు దాదాపు ముప్పావు గంట సేపు స్తంభించిపోయింది. సేవాయత్ వర్గాలతో మంత్రి అరుణ్ కుమార్ సాహు సంప్రదింపులు జరిపి నీలాద్రి విజే ఉత్సవాన్ని ముగింపజేశారు. పునరావృతం కాకుండా చర్యల్ని పటిష్టం చేయాలి: మహా రాజా మూల విరాట్లుని అనధికారిక వర్గాలు స్పర్శించడం అపచారం. ఈ విధానం నివారించాలని పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ్‌దేవ్ లోగడ ప్రతిపాదించారు. స్థానిక గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆయనతో ఏకీభవించారు. వీరివురి అభిప్రాయంతో రాష్ట్ర హై కోర్టు కూడ ఏకీభవించి పూజలు, సేవాదులు నిర్వహించే యంత్రాంగం మినహా ఇతర వర్గాలు మూల విరాట్లుకు స్పర్శించరాదని హై కోర్టు తీర్మానించింది. ఈ తీర్మానం మేరకు ఈ ఏడాది రథాలపైకి వెళ్లిన, మూల విరాట్లుకు స్పర్శించిన చర్యలు చేపడతామని హెచ్చరించిన అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలం కావడంతో ర థయాత్ర వివాదంతంగా ముగిసింది. -
తెలుగునాథుడు
పుణ్య తీర్థం జగన్నాథుడిని దర్శించుకోవడానికి పూరి వెళ్లనక్కరలేదు, తెలుగు గడ్డపై రెండు రాష్ట్రాల్లోనూ జగన్నాథ ఆలయాలున్నాయి. జగమంతనిండిన జగన్నాథుడు. మన తెలుగునాథుడు. జనసమ్మోహనుడు. అందుకే, ఆయనకు జనార్ధనుడన్న పేరు. భక్తజనులతో కలిసి మెలసి ఉండటం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. కృష్ణుడి బాల్యం, యవ్వనం... జనసమూహంతోనే కలిసి కనిపిస్తుంది. తన భక్తులను వెతుక్కుంటూ రథయాత్ర చేసే జగన్నాథుడ్ని ఒడిశా రాష్ట్రంలోని పూరిలోనే చూస్తాం. ఆ రథయాత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని కన్నులారా దర్శించాలనుకునేవారికి మన తెలుగు రాష్ట్రాల్లో వెలుగొందుతున్న జగన్నాథుడి ఆలయాలు ఇవి. సిరిపురంలో పూరి విశాఖ నగరం సిరిపురంలో కొలువై ఉన్న సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు భక్తులచేత విశేష పూజలందుకుంటున్నాడు. ఒడిశా పూరిలోని జగన్నాథునికి మాదిరిగానే ఇక్కడా రథోత్సవం, పూజలు, సంప్రదాయాలూ జరుగుతాయి. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒడిశా ఉత్కళ్ సాంస్కృతిక సమాజ్ సభ్యులు సమావేశం కావడం కోసం వచ్చిన ఆలోచన జగన్నాథుని ఆలయానికి అంకురార్పణకు దారితీసింది. అప్పట్లో విశాఖలో ఉంటున్న ఒరియా వారి అభ్యర్థన మేరకు దస్పల్లా రాజు ప్రమోద్‌కుమార్ దేవ్భంజ్ సిరిపురం (ఆకాశవాణి) వద్ద స్థలం ఇచ్చారు. దీంతో ఇక్కడే తమ ఇలవేల్పయిన జగన్నాథుని ఆలయం కట్టారు. పూరి మహారాజు గజపతి దివ్యసింగ్, దస్పల్లా మహారాజు దేవ్భంజ్లు ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చిన్నది కావడం, ఆదరణ పెరగడం వంటి కారణాలతో ఆ పక్కనే జగన్నాథునికి మరో పెద్ద ఆలయం నిర్మించారు. చిన్న గుడిలోని స్వాములను పెద్ద గుడికి తరలించారు. దీంతో ఇప్పుడక్కడ మరెక్కడా లేనివిధంగా ఇద్దరు స్వాములున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో జగన్నాథునితో పాటు లక్ష్మీగణపతి, కమల, విమల శక్తిమాతల గుడులు (పూరిలో మాదిరిగానే) కాశీ విశ్వేశ్వరుని ఆలయాలు కట్టారు. పూరి తరహాలోనే పూజలు ఏటా రథోత్సవానికి ముందు జరిగే అన్ని సంప్రదాయాలనూ ఇక్కడ పాటిస్తారు. ఆశ్చర్యం గొలిపే ఈ ఆచారాలను నిష్టగా అమలు చేస్తారు. జ్యేష్ట పౌర్ణమినాడు (స్నాన పౌర్ణమి) అద్దంలో చూస్తూ జగన్నాథుడికి పంచామృతాలతో స్నానం చేయిస్తారు. దీంతో స్వామికి జలుబు చేసి జ్వరం వస్తుంది. దీంతో స్వామికి తెల్లని పంచెతో ముసుగేస్తారు. ఈ సమయంలో స్వామి భక్తులకు దర్శనం ఇవ్వరు. జ్వరంతో ఉన్న స్వామికి పథ్యంగా శొంఠి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలను పొడి చేసి, తేనెలో కలిపి నైవేద్యంగా పెడతారు. ఇలా నాలుగైదు రోజుల పాటు నివేదించాక జ్వరం తగ్గుముఖం పట్టాక పండ్లు ఆహారంగా ఇస్తారు. ఇలా 15 రోజులకు జలుబు, జ్వరం త గ్గాక స్వామికి వేసిన ముసుగును తొలగిస్తారు. ఈ పక్షం రోజులూ స్వామి అనారోగ్యంగా ఉన్నారని భావించి గంట కూడా మోగించరు. 15 రోజుల తర్వాత స్వామికి రథోత్సవం నిర్వహిస్తారు. ఆలయం నుంచి ఊరేగింపుగా స్వాములను తీసుకెళ్లే ముందు బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేస్తారు. పూరిలో రాజవంశీయులు, ఇక్కడ దస్పల్లా రాజవంశీయులతో ఈ ప్రక్రియ చేపడ్తారు. అనంతరం రథాన్ని ఊరేగింపుగా బీచ్‌రోడ్డు అప్పుఘర్ వద్ద ఉన్న గుండిచా మందిరానికి తీసుకెళ్తారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు పూజలు చేశాక ఏకాదశినాడు తిరిగి ఆలయానికి ఊరేగిస్తూ రథంపై తీసుకొస్తారు. ఈ రథయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగుతారు. ఈ ఏడాది రథోత్సవాన్ని జూలై 6న నిర్వహిస్తున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి ఇలా వెళ్లాలి విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న సిరిపురంలో జగన్నాథుని ఆలయం ఉంది. విశాఖ రావడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. విమానాశ్రయం నుంచి 15, రైల్వేస్టేషన్‌కు 3, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం శతాబ్దాల చరిత..! ప్రశాంతంగా సాగే పంచక్రోశ ఉత్తర వాహినియైన గోదావరి నది తీరాన అగస్త్య మహా ముని తపస్సుతో తరించిన తరులు, గిరుల చెంతన రెండవ పూరీగా అలరారుతున్న దక్షిణాది జగన్నాథ స్వామి భక్తుల కొంగుబంగారమై అలరారుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలో గల ఈ జగన్నాథుడిని కోరి కొలుచుకునేవారికి కొంగు బంగారమే అవుతుందని భక్తుల నమ్మకం. పట్టణ ప్రజలే కాకుండా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్.. పట్టణాల నుంచి భక్తులు తరలి వస్తారు. నాలుగు శతాబ్దాల నుంచి వంశ పారంపర్యంగా అర్చకులు మోహనాచార్యుల కుటుంబ సభ్యులు ఇక్కడ త్రికాల పూజలు నిర్వహిస్తారు. పూరి ఆలయంలో ఉన్నట్టే! ఆలయంలో జగన్నాథస్వామి మూల విగ్రహాలతో పాటు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇందులో జగన్నాథ స్వామి సుభద్ర, బలరాముడితో కలిసి పూజలు అందుకుంటున్నాడు. అలాగే, వెంకటేశ్వరుడు, అలివేలుమంగ, పద్మావతి విగ్రహాలతో పాటు అల్వాల్, ఆండాల్ విగ్రహాలూ ఈ ఆలయంలో ఉన్నాయి. పూరిలో జరిగే స్వామి రథయాత్ర సందర్భంగా చెన్నూర్ లో అర్చనలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. వెయ్యి స్తంభాల గుడిలా...! నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నిర్మాణం వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిని పోలి ఉండటం విశేషం. రాతిస్తంభాలతో నాటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగు వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఆ ప్రాంత సంస్థానాధీశుడికి జగన్నాథస్వామి స్వప్నంలో కన్పించి ఆగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతంలో తనకు పూజలు నిర్వహించాలని కోరారట. ఆ రాజు ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణానికి వెళ్లి.. జగన్నాథ స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని, అనంతరం కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు. పంచకోసుల పుణ్యం! మంచిర్యాల పట్టణంలో నుంచి చెన్నూర్ 40 కిలోమీటర్ల దూరం. ఆలయం ఎదుట అభినవ పోతన బిరుందాంకితులు వానమామలై వరదాచార్యుల విగ్రహం ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా పట్టణ సమీపంలో గల పంచక్రోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో స్నానాలు అచరించి మొక్కులు తీర్చుకుంటారు. పంచ కోసులు ఉత్తర దిశగా గోదావరి నది ప్రవహించడంతో దక్షణ భారతదేశంలో మొట్ట మొదటిదని ఈ నదికి కాశీ అంతటి ప్రాశస్త్యం ఉందని వేదపండితులు పేర్కొంటారు. ఆలయం నుంచి గోదావరి నది రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిది పూరీ తర్వాత జగన్నాథాలయం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదిగా పేరొందింది. అయితే, ఈ ఆలయ చరిత్ర ఆధారాలు నేటికీ లభించడంలేదు. ఆలయం నిర్మాణం కాకతీయుల కాలంలో జరిగినట్టుగా మాత్రమే తెలుస్తోంది. - అట్టెమ్ మధునయ్య చెన్నూర్, ఆదిలాబాద్ వడలి జగన్నాథుడు పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోలేని వాళ్లు.. వడలి జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలోని ‘వడలి’లో 200 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ దేవాలయం పూరి జగన్నాథస్వామి ఆలయానికి నమూనాలా కనిపిస్తుంది. గర్భాలయంలోని మూలవిరాట్టులను సైతం పూరి నుంచి తీసుకువచ్చి ప్రతిష్టించడం విశేషం. ఈ దేవాలయం ఇక్కడ నిర్మించడానికి దారితీసిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా క ర్లపాలేనికి చెందిన పురుషోత్తమానంద అనే అవ ధూతకి ఓనాడు రాత్రి జగన్నాథస్వామి కలలో కనిపించి, తన ఆలయాన్ని నిర్మించవలసిందిగా చెప్పాడు. దాంతో ఆయన అందుకు అనుకూలంగా ఉండే స్థలాన్ని అన్వేషిస్తూ ప్రయాణించడం మొదలుపెట్టాడు. వడలి ప్రాంతానికి చేరుకున్నాక స్వామి కొలువుదీరి ఉండటానికి అదే అనువైన స్థలమని భావించాడు. వాకబు చేయగా ఆ ప్రాంతం నవాబుదని తెలుసుకున్నాడు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ఆయన విజయవాడ వద్ద కృష్ణానదిలో మునిగి, నిజాంనవాబు అంతఃపురంలో ప్రత్యక్షమయ్యాడట. విషయం తెలుసుకున్న నవాబు సంభ్రమాశ్చర్యాలకు లోనై.. వడలిలో సూర్యోదయం నుంచి అస్తమయం వరకు ఎంత దూరం తిరిగితే అంత భూమి ఆలయ నిర్మాణానికి ఇస్తానని ఆ అవధూతకి చెప్పాడట. ఆ అవధూత ఆ సమయంలో 1200 ఎకరాల మేర తిరిగి ఆ స్థలం దేవాలయానికి దక్కేలా చేశాడట. 1765వ సంవత్సరంలో ఒక వైష్ణవ భక్తుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అరణ్యంలా ఉండేదని, బోయలు ఎక్కువ ఉండే ఈ ప్రదేశాన్ని పూర్వం ‘వ్యాధాళి’ అనేవారట. అది కాలక్రమేణా వడాలిగా రూపాంతరం చెందింది అని చెబుతారు. నాటి నుంచి నేటి వరకు ఆలయం దిన దిన ప్రవర్ధమానమవుతూ దక్షిణ పూరీగా భక్తులతో విశేష పూజలందుకుంటోంది. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే కార్యక్రమాలతో పాటు శ్రీ కృష్ణాష్టమి నాడు ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. గుడివాడ-బంటుమిల్లి ప్రధాన రహదారికి సమీపంలో గల ఈ పుణ్య క్షేత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి 60 కి.మీ దూరం, గుడివాడ రైల్వే స్టేషన్‌కి 15 కి.మీ దూరంలో ఉంది. సుందర మనోహరుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు పూరి జగన్నాథ మందిరాన్ని దర్శించిన అనుభూతే కలుగుతుంది. అచ్చు పూరి ఆలయానికి నమూనాగా ఉండే ఈ దేవాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉంది. ఆలయం మొత్తం ఎర్రని రంగులో, ఒడిస్సీ శిల్పకళా చాతర్యంతో అలరారుతుంటుంది. ఎటువైపు చూసినా అబ్బురపరిచే శిఖర భాగం 70 అడుగుల ఎత్తుతో ఆధ్యాత్మికకు అసలు సిసలైన అద్దం పడుతుంది. పరిసరాలు ఎంతో ప్రశాంతంగా, మరెంతో రమణీయంగా ఉండే ఈ ఆలయాన్ని ఒరియా కమ్యూనిటీ వారు 2009లో నిర్మింపజేశారు. అత్యంత సుందర మనోహరంగా కనిపించే ఈ దేవాలయంలో పూరిలో మాదిరిగానే జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో మూల విరాట్టుగా కొలువుదీరి ఉన్నాడు. పూరీలో మాదిరిగానే ఈ ఆలయంలోనూ జగన్నాథుడికి నిత్య పూజలు జరుపుతారు. అలాగే పూరిలో జరిగినట్టు జేష్ట్య, ఆషాఢమాసంలో జరిగే ప్రత్యేక సేవలన్నీ జరుపుతున్నారు. భక్తులు ఈ సేవలలో పాల్గొని ఆనందపారవశ్యం చెందుతారు. రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణజన్మాష్టమి, వసంతపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జగన్నాథుడితో పాటు లక్ష్మి, శివ, గణేష, హనుమాన్, నవగ్రహ మూర్తులను దర్శించుకోవచ్చు. నగర సందర్శనలో భాగంగా పూరి ఆలయం దర్శనం కూడా ఒకటిగా ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఏడాదిలో ఒక్కరోజే..! శ్రీ జగన్నాథ స్వామి తూర్పు గోదావరి జిల్లాలోని దేవి చౌక్‌లో బలభద్ర, సుభద్ర సమేతుడై కొలువుదీరి ఉన్నాడు. అతి ప్రాచీన ఆలయంగా పేరొందిన ఈ మందిరాన్ని దేశంలోనే 2వ పూరిగా జగన్నాథుడిని భక్తులు కొలుస్తుంటారు. దీప, ధూప, నైవేద్యాలతో స్వామి వారికి నిత్యం పూజలు జరుపుతారు. అయితే, కేవలం తొలి ఏకాదశి రోజున మాత్రమే ఈ దేవాలయాన్ని భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంచుతారు. ఈ సందర్భంగా అత్యంత వేడుకగా జరిగే స్వామి వారి పూజలను కనులారా వీక్షించాల్సిందే తప్ప వర్ణించనలవి కాదంటారు భక్తులు. దేదీప్యమానంగా వెలుగొందే జగన్నాథుడు భక్తులకు అభయమిస్తూ విశేషంగా ఆకట్టుకుంటాడు. మిగతా అన్నిరోజులు పూజారులకు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. 200 ఏళ్లుగా ఇక్కడ స్వామి విశేష పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయాన్ని వైష్ణవభక్తులు నిర్మించారని కథనాలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది జగన్నాథ స్వామి దేవాలయం. సమీప బస్ స్టేషన్ రాజమండ్రి. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. -
పూరిజగన్నాథ రథయాత్ర
-
నవకళేబర యాత్ర ప్రారంభం
భువనేశ్వర్ : ప్రతి యేటా ఎంతో వైభవంగా నిర్వహించే పూరిజగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా విశిష్టమైన మిలీనియం నవకళేబర యాత్ర ప్రారంభమైంది. క్షలాదిమంది భక్తులతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకై పూరీ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. బలభద్ర, సుభద్ర సమేతుడై జగన్నాథుడు పూరీ పురవీధుల్లో దర్శనమిచ్చే అద్భుత క్షణాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు లక్షలాది భక్తులు ఇప్పటికే పూరి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష విదియ నాడు మొదలై... తొమ్మిది రోజుల తర్వాత ఆషాడ శుక్ల దశమితో వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరిగే ఈ ఉత్సవాల కోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూరీ జగన్నాథుడి ఆలయం పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది జగన్నాథ రథయాత్రే కానీ.. ఆ ఉత్సవంతో పాటు అక్కడ ఎన్నో ఆసక్తికరమైన వేడుకలు జరుగుతుంటాయి. వాటన్నిటిలోకీ ప్రత్యేకమైనది.. నవకళేబర. అంటే.. కొత్త దేహం అని అర్థం. పూరీ ఆలయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు రాతి విగ్రహాల్లాగా శాశ్వతం కావు. కొయ్యతో తయారైనవనే విషయం అందరికీ తెలిసిందే. అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో... పూరీ క్షేత్రంలో గర్భగుడిలోని దారు విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా వేప చెక్కతో చెక్కిన సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకనే నవకళేబర’గా వ్యవహరిస్తారు. అధిక ఆషాఢ మాసం కనిష్ఠంగా 8 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 19 సంవత్సరాలకొకసారి వస్తుంటుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ , మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సవాల ఏర్పట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సుమారు రెండువేలమంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ క్యాంపులు, అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది, ప్రథమ చికిత్సా కేంద్రాలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు. మరోవైపు ఈ సందర్భంగా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తమ సృజనాత్మకు పదును పెట్టి జగతి నాథుడు శ్రీజగన్నాథుని నవకళేబర మహోత్సవం విశ్వవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకునేలా పూరీ బీచ్‌లో అద్భుతాన్ని సృష్టించారు. -
నేడు పూరీజగన్నాథుని రథయాత్ర
-
డోంబివలిలో 23 నుంచి శ్రీవేంకటేశ్వరసామి కల్యాణోత్సవాలు
దాదర్, న్యూస్‌లైన్ : డోంబివలి పట్టణంలో ఈ నెల 23వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆంధ్ర కళాసమితి ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలోని తాయి పింగళే చౌక్ వద్దగల సర్వేష్ సభాగృహ ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటలకు సుప్రభాత సేవతో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ తర్వాత సామూహిక లక్ష తులసీ అర్చన, విష్ణు సహస్ర నామం, లలితా సహస్రనామ పఠనం, భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయని వారు పేర్కొన్నారు. 22నరథ యాత్ర... శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ డోంబివలిలోని ఆనంద్‌నగర్‌లోగల ఆనంద్ కుటీర్ ప్రాంగణంలో శనివారం ఉదయం 10 గంటలకు తిరుమంజన మహోత్సవం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సర్వేష్ సభాగృహం వరకు స్వామి వారి రథయాత్రను నిర్వహించనున్నారు. తర్వాత సభా ప్రాంగణంలో ఎదుర్కోలు వేడుకలు జరగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భక్తలంతా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆంధ్ర కళాసమితి నిర్వాహకులు కోరారు. -
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర ప్రారంభం
-
పూరీ జగన్నాధ రధయాత్రలు ఏర్పాట్లు
-
సెప్టెంబర్ 2 నుంచి హరికృష్ణ యాత్ర?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ రెండో తేదీ నుంచి చైతన్య రధయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అదే రోజు హరికృష్ణ పుట్టిన రోజు కూడా. ఆయన మొదట తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నెక్లెస్ రోడ్డులోని ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడినుంచి నేరుగా ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలోని నిమ్మకూరు చేరుకుంటారు. అక్కడ తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులర్పించి యాత్రను ప్రారంభిస్తారని సన్నిహితవర్గాలు తెలిపాయి. సమైక్యాంధ్ర కోసం గ్రామాల్లో జరిగే ఆందోళనల్లో పాల్గొంటూ ఆయన ముందుకు సాగుతారని తెలుస్తోంది. సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా హరికృష్ణ నిర్విహ ంచే ఈ చైతన్య రథయాత్రకు సహకరించాలని, అందులో భాగస్వామ్యం కావాలని ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలనే ఏకైక నినాదంతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆ మౌలిక సూత్రానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనే ఆంశంపై వారు మథనపడుతున్నారు. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ అభిమానులందరూ ఒకచోట సమావేశమైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కట్టడి చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో వారు ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్లద్వారా సంప్రదించుకుంటూ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆశయాన్ని ఎవరు సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరో వారికి అండగా నిలిస్తే మంచిదని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హరికృష్ణ యాత్రలో తాము పూర్తిగా భాగస్వామ్యం అవుతామని ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడు ఒకరు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో కీలకపాత్ర పోషించే ఒక నాయకుడు ఈ విషయంలో వీరందరినీ సమన్వయ పరిచారని సమాచారం. బాబు బుజ్జగింపుల పర్వం తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకున్న తరుణంలో.. అందుకు పూర్తి విరుద్ధంగా పొలిట్బ్యూరోసభ్యుడైన హరికృష్ణ తన ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో పాటు సమైక్య యాత్రను చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, దీనివల్ల పార్టీ మరింత నష్టపోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నట్లు సమాచారం. అందుకే మధ్యవర్తుల ద్వారా హరికృష్ణను బుజ్జగించడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా... తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై హరికృష్ణ ఘాటుగా స్పందించారు. తన విషయంలో కుక్కలు మొరుగుతున్నాయని, ఆ మొరుగుళ్లకు తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన మంగళవారం మీడియాతో చెప్పారు. -
పాహిమాం.. రాఘవేంద్ర
న్యూస్‌లైన్, మంత్రాలయం (కర్నూలు): జగద్గురుని మహా రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. భక్తజనుల శ్రీగురుని నామజపం.. వేదపండితులు వేదపఠనం.. మంగళవాయిద్యాల సుస్వరాగం.. కళాకారుల కోలాహలం మధ్య లోకగురువు మహారథంపై ఊరేగారు. రాఘవుని రథయాత్రతో వేదభూమి వైభవం చాటగా తుంగభద్రమ్మ పరవశించింది. రాఘవరాయుడి కీర్తిని భక్తజనం పొగడగా..కళాకారుని అందె చిందేసింది. రాఘవేంద్రుడి 342వ ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరాధన సందర్భంగా మహారథయాత్ర నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుయతీంధ్రతీర్థులు, ఉత్తరాధికారి సుభుదేంద్రతీర్థులు ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులను మహారథంపై ఉంచి పూజలు, మహా మంగళాహారథులు ఇచ్చారు. భక్తులకు రాఘవేంద్రుడి మహిమలతో కూడిన చరితను వినిపించి మహారథయాత్రకు అంకురార్పన చేశారు. శ్రీమఠం ప్రాంగణం నుంచి ప్రధాన ముఖద్వారం మీదుగా రాఘవేంద్రుల సర్కిల్ వరకు అంగరంగా వైభవంగా రథయాత్ర సాగింది. సర్కిల్ మీదుగా మఠం ప్రాంగణం వరకు లాగి యాత్రకు ముగింపు పలికారు. నేడు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన రాఘవేంద్రుల ఆరాధన సప్త రాత్సోవాల్లో సందర్భంగా శనివారం పూర్వపు పీఠాధిపతులు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహిస్తారు. ఉభయపీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుదేంద్రతీర్థులు వారి పటాలకు విశిష్టపూజలు నిర్వహిస్తారు. యోగీంద్ర సభా ప్రాంగణంలో బెంగుళూరుకు చెందిన మదుసూధన్ నందగిరిచే దాసవాణి ఉంటుంది. బళ్లారికి చెందిన కళాక్షితి డ్యాన్స్ స్కూల్ బందంచే భరతనాట్య ప్రదర్శన నిర్వహిస్తారు. -
పూరీజగన్నాధుని రథయాత్ర