త్రిపురలో విషాదం.. రథానికి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగలడంతో | Many Died Including Childrens By Electrocution During Rath Yatra In Tripura | Sakshi

జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి.. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగలడంతో

Published Wed, Jun 28 2023 9:21 PM | Last Updated on Wed, Jun 28 2023 9:29 PM

Many Died Including Childrens By Electrocution During Rath Yatra In Tripura - Sakshi

త్రిపురలో విషాదం చోటు చేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌ వద్ద  ఇనుముతో చేసిన జగాన్నథ రథం ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలను తాకింది. దీంతో కరెంట్‌ షాక్‌కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రథానికి విద్యుత్‌ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రథయాత్ర పండగ జూన్‌ 20న ప్రారంభమవ్వగా.. ఉత్సవాల ముగింపులో భాగమైన ‘ఉల్టా రథ్‌’ ఊరేగింపులో జగన్నాథ బారి ఆలయానికి వస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement