high tension power wire
-
త్రిపురలో విషాదం.. రథానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో
త్రిపురలో విషాదం చోటు చేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్ వద్ద ఇనుముతో చేసిన జగాన్నథ రథం ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రథానికి విద్యుత్ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రథయాత్ర పండగ జూన్ 20న ప్రారంభమవ్వగా.. ఉత్సవాల ముగింపులో భాగమైన ‘ఉల్టా రథ్’ ఊరేగింపులో జగన్నాథ బారి ఆలయానికి వస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. -
తంజావూరు రథోత్సవంలో విషాదం
సాక్షి, చైన్నై: తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథంపై పడడంతో 11 మంది మరణించారు. తంజావూరు జిల్లా కలిమేడులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్ స్వామి మఠం ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు అప్పర్ సత్య జాతరని నిర్వహిస్తుంది. మహాశివుడికి ప్రతిరూపంగా కొలిచే ఈ అప్పర్ ఆలయానికి చెందిన పండుగలో రెండో రోజు బుధవారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. తంజావూర్–బూదలూర్ రహదారిపై రథం వెళుతుండగా తెల్లవారుజాముయ సుమారు 3 గంటల సమయంలో రథం పైభాగంలో 20 అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 13, 14, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, తండ్రీ, కుమారుడు ఉన్నారు. కరెంట్ షాక్ కొట్టిన వెంటనే రథాన్ని లాగుతున్న కొందరు భక్తులు కుప్పకూలిపోయారు. కరెంట్ షాక్‌కి మంటలు వ్యాపించడంతో రథం నిలువునా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘటనకి రథోత్సవం తిలకించడానికి వచ్చిన ప్రజలు బెదిరిపోయారు. చెల్లాచెదురుగా పరుగులు తీస్తూ హాహాకారాలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన కుటుంబాలకు రూ.50 వేలు సహాయంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తంజావూరు వెళ్లి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, డీఎంకే తరపున తలా రూ.2 లక్షలు సాయంగా అందజేశారు. -
సుంకులమ్మ తిరునాళ్లలో ఘోర ప్రమాదం
* బండిశిల రథంపై తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు * ముగ్గురు మృతి * 10 మందికి తీవ్రగాయాలు * 30 మందికి స్వల్ప గాయాలు * అనంతపురం జిల్లాలో ఘోరం గుత్తి/పామిడి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లాలో జరుగుతున్న సుంకులమ్మ బండిశిల తిరునాళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. బండిశిల రథాన్ని ఊరేగింపుగా తీసుకొస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మూడు ఎద్దులు కూడా చనిపోయాయి. పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాశేపల్లి, గుత్తి అనంతపురం, పామిడి మండలం రామరాజుపల్లి గ్రామస్తుల సమక్షంలో సుంకులమ్మ బండిశిల తిరునాళ్ల ఈ నెల ఏడో తేదీన ప్రారంభమయ్యాయి. శుక్రవారం రామరాజుపల్లి నుంచి గుత్తి అనంతపురం గ్రామ శివారులోని సుంకులమ్మ ఆలయం వద్దకు బండి శిల రథాన్ని ఏడు జతల ఎద్దులతో తీసుకెళుతున్నారు. రాత్రి 8.20 గంటలకు కాశేపల్లి వద్దకు రాగానే రథం అదుపుతప్పి పక్కకు వెళ్లిపోయింది. దీంతో పైనున్న 220 కేవీ విద్యుత్ లైన్లకు రథం తగిలి అవి తెగి ఎద్దులపైన, పక్కనే వస్తు న్న జనంపైన పడ్డాయి. జనం భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. విద్యుదాఘాతంతో కాశేపల్లికి చెందిన ముత్యాలరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామాంజులరెడ్డి (30), సుధీర్, మాణిక్యాచారి (20), పవన్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ (50), లక్ష్మిరెడ్డి, బాబురెడ్డి, శ్రీరామరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిని 108లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. రామాం జులరెడ్డి మార్గం మధ్యలోనే మరణించాడు. లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో మృతిచెందారు. మిగతా 10 మందికి 70 శాతం మేర శరీరం కాలిపోయింది. వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. స్వల్పంగా గాయపడిన 30 మందిని గుత్తి, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. విద్యుదాఘాతానికి గురైన బండిశిల రథం కాలిపోయింది. విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో గ్రామంలో అంధకారం అలుముకుంది. ఇదీ బండిశిల రథం.. తిరునాళ్లలో భాగంగా పొడవాటి దుంగను అలంకరించి ఒక ఎద్దుల బండిపై పీఠం తయారు చేసి నిల్చోబెడతారు. దీనినే బండిశిల రథమంటారు. దుంగ పైభాగంలో ఎర్రటి వస్త్రం, ఒక గంట ఉంటాయి. ఈ బండిని ఏడు జతల ఎద్దులు లాగుతాయి. తిరునాళ్లు జరిగే రోజుల్లో ఈ రథం పలు గ్రామాల్లో సంచరిస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రామరాజుపల్లికి చేరుకుంది. సాయంత్రం కాశేపల్లికి బయల్దేరింది. కాశేపల్లి నుంచి రాత్రికి గుత్తి అనంతపురం గ్రామం చేరుకోవాల్సి ఉంది. ఆదివారం నాటికి తిరిగి రామరాజుపల్లికి చేరుకోవడంతో తిరునాళ్లు ముగుస్తాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కాశేపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లను రథం పైభాగం తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. -
పెళ్లి బస్సులో మంటలు.. ఆరుగురి మృతి
భింద్: మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా లో శుక్రవారం రాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు సజీవదహనమయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. హైటెన్షన్ విద్యు త్ తీగ బస్సుపై పడడంతో మంటలు చెలరేగాయి. బరోవాలో పెళ్లికి హాజరైన 60 మందితో వెళ్తున్న ఈ బస్సు భింద్ పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైంది.