మ్యాక్స్ జెట్‌కు ‘వీటీ-ఏకేవీ’ పేరుతో రిజిస్ట్రేషన్
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి పటిష్ట భద్రత ఉంటుంది. తాను ప్రయాణించే వాహనాలు, విమానాలు, ప్రైవేట్ జెట్‌లు.. ఇలా ప్రతిదాన్ని భద్రత పరంగా పకడ్బందీగా నిర్వహిస్తుంటారు. అంబానీ వినియోగించే బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌ను ఇటీవల తనిఖీలు నిర్వహించి వేరే పేరుతో రిజిస్టర్ చేశారు. గతంలో ఈ జెట్ శాన్ మారినో కోడ్ కింద ‘టీ7-లోటస్’ పేరుతో ఉండేది. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దీన్ని ‘వీటీ-ఏకేవీ’గా రిజిస్టర్ చేశారు.
ఈ విలాసవంతమైన జెట్‌ను నడపడానికి ఉత్తమ పైలట్లను మాత్రమే ఎంచుకుంటారు. దేశంలోనే అత్యంత ధనవంతుడి భద్రత, సౌకర్యానికి సంబంధించిన విషయం కావడంతో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈ జెట్ నడిపే పైలట్లకు ఏటా వేతనం 1,20,000 డాలర్లు(సుమారు రూ.ఒక కోటి) ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో తొలి అడుగులు
సుమారు రూ.1,000 కోట్ల విలువైన బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌ను రిలయన్స్ కమర్షియల్ డీలర్స్ లిమిటెడ్ (ఆర్‌సీడీఎల్) నిర్వహిస్తోంది. దీన్ని నడిపే పైలట్లు నిత్యం భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ అప్‌డేట్‌గా ఉండటానికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ముఖేష్ అంబానీ వద్ద ఉన్న ఇతర ప్రైవేట్ జెట్లను కూడా ఆర్‌సీడీఎల్ పర్యవేక్షిస్తోంది. ఇది అత్యున్నత స్థాయి విమానయాన భద్రత, నైపుణ్యాన్ని కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment