Ambani Group
-
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ద్వారకాధీశ్ దేవాలయంలో అంబానీ పూజలు
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు చెందిన ద్వారకాధీశ్ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి పాదాలకు నమస్కరించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇద్దరిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంది. #WATCH | Gujarat | Reliance Industries Chairman, Mukesh Ambani and his son Anant Ambani offered prayers at Dwarkadhish Temple in Devbhumi Dwarka district yesterday, on 24th October. pic.twitter.com/6efbOI2zNj — ANI (@ANI) October 25, 2023 -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్‌ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్‌ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్‌ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్‌తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కి కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ చోటు దక్కించుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్‌లో చేరారు. యేల్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్ పేర్కొంది. అలాగే రిలయన్స్ సామ్రాజ్యాన్ని నడిపించేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారని తెలిపింది. మరోవైపు, భారీ స్థాయిలో ఆన్లైన్ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్ నిరూపించారని ఫార్చూన్ పేర్కొంది. అటు స్టార్టప్స్ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్ గురించి అంతగా తెలియని మను జైన్ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది. చదవండి: బ్లూచిప్ షేర్ల దన్ను -
ఐపీవో సన్నాహాల్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్
ముంబై: వరుస ఐపీవోలకు అనిల్ అంబానీ గ్రూప్ ప్రణాళికలు వేసుకుంటోంది. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువ్ ఫండ్) వచ్చే మార్చిలోపు ఐపీవోకు రానున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఐపీవోకు వెళ్లాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థలకూ మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కావడం గమనార్హం. ఐపీవోకు బోర్డు ఆమోదం తెలిపిందని, ఐఆర్డీఏ, సెబీ అనుమతుల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి కంపెనీ పుస్తక విలువ రూ.1,250 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.130 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఐపీవో ద్వారా సమకూరే నిధులను వ్యాపార విస్తరణ, విలీనాలు, కొనుగోళ్ల కోసం వినియోగించుకోవాలన్న అభిప్రాయంతో ఉంది. ఇక, వాటా విక్రయం ద్వారా వ్యూహాత్మక భాగస్వామిని చేర్చుకోవాలన్న ప్రయత్నాల్లోనూ ఉన్నట్టు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్‌జైన్ వెల్లడించారు.