న్యూఢిల్లీ: విమాన సర్వీసుల కోసం కొత్తగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్‌తో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపాయి. టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌తో దేశీయ విమానయాన రంగానికీ ఊతం లభిస్తుందని పేర్కొన్నాయి. ఎయిర్‌లైన్స్ ఏర్పాటుకు అనుమతులు కోరుతూ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ)కి సమర్పించిన దరఖాస్తులో ఈ అంశాలు పేర్కొన్నాయి. పైలట్లు, టెక్నీషియన్లు, మేనేజర్లు, సుశిక్షి తులైన కార్మికులకు కొత్త సంస్థలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపాయి. ప్రతిపాదిత జేవీలో టాటా సన్స్‌కి 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 49 శాతం వాటాలు ఉంటాయి.