Indian Aviation
-
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట. -
భారత్‌కు మరో 2,500 విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన రంగానికి 2042 నాటికి మరో 2,500కు పైగా విమానాలు అవసరం అవుతాయని బోయింగ్ అంచనా వేస్తోంది. ‘పెరుగుతున్న ప్రయాణికులు, సరుకు రవాణా డిమాండ్‌ను తీర్చడానికి దక్షిణాసియాకు చెందిన విమానయాన సంస్థలు రాబోయే రెండు దశాబ్దాలలో తమ విమానాల పరిమాణాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని అంచనా. వృద్ధి, విమానాల భర్తీని పరిష్కరించడానికి ఈ కంపెనీలకు 2,705 కంటే ఎక్కువ కొత్త విమానాలు అవసరమవుతాయి. ఇందులో 92 శాతం భారత్ కైవసం చేసుకుంటుంది’ అని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డేరిన్ హస్ట్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అంచనా వేసిన మొత్తం విమానాల్లో.. తక్కువ దూరం ప్రయాణించడానికి అనువైన చిన్న విమానాలు 2,300లకుపైగా, సుదూర ప్రాంతాల కోసం సుమారు 400 విమానాలు అవసరం అవుతాయని చెప్పారు. ఆసియాలో దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పరంగా మహమ్మారి ముందస్తు స్థాయికి పుంజుకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద మార్కెట్ భారత్ మాత్రమేనని ఆయన అన్నారు. -
అందరికీ విమానయోగం
శివమొగ్గ/బెల్గావీ: ‘‘హవాయి చెప్పులేసుకునే సామాన్యులు కూడా హవాయీ జహాజ్ (విమాన) ప్రయాణం చేయగలగాలి. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం కర్నాటకలోని శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత వైమానిక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. ‘‘మున్ముందు మనకు వేలాది విమానాలు అవసరమవుతాయి. వాటిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుంటున్నా భారత్‌లోనే తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు మనమంతా దర్జాగా మేడిన్ ఇండియా విమానాల్లోనే ప్రయాణిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోదీ చెప్పారు. 2014 దాకా దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుంటే గత తొమ్మిదేళ్లలోనే తాము మరో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘2014కు ముందు ఎయిరిండియాను నష్టాలు, కుంభకోణాల సంస్థగా చూసే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి సంస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నూతన భారతదేశానికి ప్రతీకగా విజయపుటంచులు చూస్తోంది’’ అన్నారు. రూ.3,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శివమొగ్గ జిల్లాకే చెందిన కర్నాటక మాజీ సీఎం, బీజేపీ అగ్ర నేత బి.ఎస్.యడియూరప్ప సోమవారం 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో సభికులంతా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మోదీ కోరారు. ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారని, రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డబుల్ ఇంజన్ సర్కారుకే మరో అవకాశమివ్వాలని కర్నాటక ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. అనంతరం బెల్గావీలో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు కారులో నుంచుని అభివాదం చేస్తూ సాగారు. అభివృద్ధి చేసిన బెల్గావీ రైల్వేస్టేషన్ భవనాన్ని, రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్ల మంది రైతులకు ప్రధాన్‌మంత్రీ కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకంలో 13వ విడతగా రూ.16 వేల కోట్ల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పెద్ద విమానాలు సమకూర్చుకోవాలి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే!
కరోనా మహమ్మారి కారణంగా డీలా పడిన వాటిలో ఏవియేషన్ రంగం కూడా ఉంది. అయితే కరోనా పరిస్థితులు తొలగినా దేశీయ విమానయాన సంస్థలకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో.. విమానయాన సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15 నుంచి 17 వేల కోట్లు నష్టాలను చవిచూడబోతున్నారని తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడమే ఈ నష్టాలకు ప్రధాన కారణమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ రంగానికి రూ.23వేల కోట్ల నష్టం వాటిల్లింది. దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, గత కొన్ని నెలలుగా కరోనా కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదు కాకపోవడం వంటి కారణాలతో దేశీయ ప్రయాణీకుల రద్దీ సంవత్సరానికి 57.7 శాతం వృద్ధిని నమోదు చేసి FY22లో 84.2 మిలియన్లకు చేరుకుంది. అయితే అమెరికా డాలర్‌తో రూపాయిలో ఏదైనా సానుకూల లేదా ప్రతికూల కదలిక అదే విధంగా జెట్ ఇంధన ధరలలో ఏదైనా పెరుగుదల లేదా తగ్గుదల భారతదేశంలోని విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రయాణీకుల ట్రాఫిక్‌లో ఆశించిన మెరుగుదల ఉన్నప్పటికీ, ఎటిఎఫ్ ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం, ఈ రెండూ కారణాల వల్ల నష్టాలను వస్తున్నట్లు నివేదిక చెప్తోంది. ఏటీఎఫ్ కిలోలీటర్ ధర గత ఏడాది సుమారు రూ.7ంవేలు ఉండగా, ప్రస్తుతం రూ. లక్ష 24వేలకు చేరింది. చదవండి: గౌతమ్ అదానీ: 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 2030 కల్లా నెం.1 లక్ష్యం! -
కరోనా: 29 లక్షలకు పైగా ఉద్యోగాలకు ముప్పు
సాక్షి, ముంబై: ఇప్పటికే సంక్షోభంలో పడిన భారత విమానయాన రంగంపై కరోనా వైరస్ దెబ్బ కోలుకోలేని విధంగా తాకనుంది. కరోనా వైరస్ కట్టడికి అమలవుతున్న లాక్డౌన్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఎయిర్లైన్ల సంస్థల ఆదాయాలుగణనీయంగా క్షీణించాయి. ఇది ఉద్యోగుల వేతనాల కోతకుదారి తీసింది. తాజా ఈ సంక్షోభం కారణంలో విమానయాన రంగంలో 29 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. (5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) కరోనా వైరస్ సంక్షోభం భారతదేశంలో 29,32,900 లక్షల ఏవియేషన్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) తెలిపింది. అంతేకాకుండా, 2019తో పోలిస్తే 2020లో భారతదేశం విమాన ప్రయాణ డిమాండ్ సగానికి పడిపోనుందని అంచనావేసింది. ప్రయాణీకుల రద్దీలో 47 శాతం క్షీణత కనిపించనుంది. ఫలితంగా గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రూ .85,000 కోట్లకు పైగా ఆదాయం తగ్గుతుందని ఐఏటీఏ పేర్కొంది. విమానయాన సంస్థలు ఈ భారాన్ని భరించేందుకు నగదు లభ్యతపై ఆయా ప్రభుత్వాలు చర్యలు లేకపోతే గ్లోబల్ ఏవియేషన్ రంగానికి మరింత నష్టం వాటిల్లుతుందని భావించింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) భారత్, ఇండోనేషియా, జపాన్, మలేషియా, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్ తక్షణ చర్యలు తీసుకోవలసిన దేశాలుగా ఐఏటీఏ గుర్తించింది. పరిస్థితి క్షీణిస్తోంది. విమానయాన సంస్థలు మనుగడ ప్రమాదంలో వుందని వ్యాఖ్యానించింది. రెండవ త్రైమాసికంలో 61 బిలియన్ డాలర్ల నష్టంతో వారు ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ప్రాంతీయ ఉపాధ్యక్షుడు (ఆసియా-పసిఫిక్) కాన్రాడ్ క్లిఫోర్డ్ చెప్పారు. కరోనావైరస్ సంక్షోభం ఈ ఏడాది ప్రపంచ విమానయాన ప్రయాణీకుల ఆదాయం 2019 తో పోల్చితే 55 శాతం తగ్గుతుందని ఏప్రిల్ 14 న 2019 తోఐఏటీఏ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని విమానయాన సంస్థలు అత్యధిక ఆదాయ క్షీణతను నమోదు చేస్తాయని తెలిపింది. (కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం) -
పాకిస్తాన్ మరో కీలక నిర్ణయం..!
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో పాక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ గగనతలంలో భారత విమానాలపై నిషేధం విధిస్తున్నామని మంగళవారం ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌కు వెళ్లే భారత వాణిజ్య విమానాలపై కూడా నిషేధం వర్తిస్తుందని పాక్ సైన్స్, సాంకేతిక మంత్రి ఫవాద్ చౌద్రీ స్పష్టం చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫవాద్ వెల్లడించారు. దీనికి సంబంధించిన న్యాయప్రక్రియలు త్వరలోనే పూర్తిచేయనున్నామని అన్నారు. ‘మోదీ ప్రారంభించారు.. మేం ముగిస్తాం’ అంటూ ఫవాద్ ట్వీట్‌చేశారు. బాలాకోట్ దాడుల వేళ తమ దేశంమీదుగా భారత విమానాల రాకపోకలను పాక్ నిషేధించింది. -
‘ఇండియా ఏవియేషన్-2014’
-
జేవీతో మరిన్ని ఉద్యోగాలు: టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: విమాన సర్వీసుల కోసం కొత్తగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్‌తో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపాయి. టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌తో దేశీయ విమానయాన రంగానికీ ఊతం లభిస్తుందని పేర్కొన్నాయి. ఎయిర్‌లైన్స్ ఏర్పాటుకు అనుమతులు కోరుతూ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)కి సమర్పించిన దరఖాస్తులో ఈ అంశాలు పేర్కొన్నాయి. పైలట్లు, టెక్నీషియన్లు, మేనేజర్లు, సుశిక్షి తులైన కార్మికులకు కొత్త సంస్థలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపాయి. ప్రతిపాదిత జేవీలో టాటా సన్స్‌కి 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 49 శాతం వాటాలు ఉంటాయి.