సాక్షి, ముంబై: ఇప్పటికే సంక్షోభంలో పడిన భారత విమానయాన రంగంపై కరోనా వైరస్ దెబ్బ కోలుకోలేని విధంగా తాకనుంది. కరోనా వైరస్ కట్టడికి అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఎయిర్లైన్ల సంస్థల ఆదాయాలుగణనీయంగా క్షీణించాయి. ఇది ఉద్యోగుల వేతనాల కోతకుదారి తీసింది. తాజా ఈ సంక్షోభం కారణంలో విమానయాన రంగంలో 29 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. (5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!)
కరోనా వైరస్ సంక్షోభం భారతదేశంలో 29,32,900 లక్షల ఏవియేషన్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) తెలిపింది. అంతేకాకుండా, 2019తో పోలిస్తే 2020లో భారతదేశం విమాన ప్రయాణ డిమాండ్ సగానికి పడిపోనుందని అంచనావేసింది. ప్రయాణీకుల రద్దీలో 47 శాతం క్షీణత కనిపించనుంది. ఫలితంగా గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రూ .85,000 కోట్లకు పైగా ఆదాయం తగ్గుతుందని ఐఏటీఏ పేర్కొంది. విమానయాన సంస్థలు ఈ భారాన్ని భరించేందుకు నగదు లభ్యతపై ఆయా ప్రభుత్వాలు చర్యలు లేకపోతే గ్లోబల్ ఏవియేషన్ రంగానికి మరింత నష్టం వాటిల్లుతుందని భావించింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!)
భారత్, ఇండోనేషియా, జపాన్, మలేషియా, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్ తక్షణ చర్యలు తీసుకోవలసిన దేశాలుగా ఐఏటీఏ గుర్తించింది. పరిస్థితి క్షీణిస్తోంది. విమానయాన సంస్థలు మనుగడ ప్రమాదంలో వుందని వ్యాఖ్యానించింది. రెండవ త్రైమాసికంలో 61 బిలియన్ డాలర్ల నష్టంతో వారు ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ప్రాంతీయ ఉపాధ్యక్షుడు (ఆసియా-పసిఫిక్) కాన్రాడ్ క్లిఫోర్డ్ చెప్పారు. కరోనావైరస్ సంక్షోభం ఈ ఏడాది ప్రపంచ విమానయాన ప్రయాణీకుల ఆదాయం 2019 తో పోల్చితే 55 శాతం తగ్గుతుందని ఏప్రిల్ 14 న 2019 తోఐఏటీఏ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని విమానయాన సంస్థలు అత్యధిక ఆదాయ క్షీణతను నమోదు చేస్తాయని తెలిపింది. (కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం)
Comments
Please login to add a commentAdd a comment