ముంబై: కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన నియామక ప్రక్రియలో కదలిక మొదలైంది. ప్రస్తుతం వివిధ జాబ్ పోర్టల్స్‌లో 3.5 లక్షల ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్ జాబ్స్‌లో జూన్ నుంచి వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ఈ ధోరణి ఈ ఆర్ధిక సంవత్సరం చివరి వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడ్‌టెక్, ఈ–లెరి్నంగ్, హెల్త్‌కేర్, హెచ్‌ఆర్, ఫిన్‌టెక్ విభాగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయని టీమ్‌లీజ్, ఫ్రెషర్‌వరల్డ్.కామ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ కౌషిక్ బెనర్జీ తెలిపారు. ఐటీఈఎస్, తయారీ రంగం, బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికం, సెమికండక్టర్ల పరిశ్రమలోనూ వృద్ధి నమోదవుతుందన్నారు. అడ్మిని్రస్టేషన్‌లో 14 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10 శాతం, కస్టమర్ సరీ్వసింగ్‌లో 8 శాతం, మార్కెటింగ్‌లో 5 శాతం, సేల్స్‌లో 4 శాతం ఫ్రెషర్స్ జాబ్స్ పెరిగాయని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. (చదవండి: 14 వేల మందిని నియమించుకుంటాం...)
క్యాంపస్ జాబ్స్ వేతనాల్లో 10 శాతం క్షీణత..
లాక్‌డౌన్ ఎత్తేసిన నాటి నుంచి నియామకాల్లోనూ కదలిక మొదలైంది. మే– సెపె్టంబర్ మధ్య ఆఫర్ లెటర్స్ హోల్డింగ్‌లో ఉన్న 65 శాతం మంది నియామకం పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి–మార్చి కాలంలో ప్రీ–కోవిడ్ స్థాయికి నియామకాలు చేరుకుంటాయని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆదిత్య మిశ్రా తెలిపారు. ఆఫ్‌క్యాంపస్ నియామకాలను పరిశీలిస్తే.. గత ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది 75 శాతం పూర్తయ్యాయన్నారు. అయితే ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కంపెనీలు ఉద్యోగుల శిక్షణ కోసం సెల్ఫ్ లెరి్నంగ్, వీడియో ఆధారిత శిక్షణ, బోధన వంటి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment