కరోనా మహమ్మారి కారణంగా డీలా పడిన వాటిలో ఏవియేషన్ రంగం కూడా ఉంది. అయితే కరోనా పరిస్థితులు తొలగినా దేశీయ విమానయాన సంస్థలకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో.. విమానయాన సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15 నుంచి 17 వేల కోట్లు నష్టాలను చవిచూడబోతున్నారని తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడమే ఈ నష్టాలకు ప్రధాన కారణమని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ రంగానికి రూ.23వేల కోట్ల నష్టం వాటిల్లింది. దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, గత కొన్ని నెలలుగా కరోనా కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదు కాకపోవడం వంటి కారణాలతో దేశీయ ప్రయాణీకుల రద్దీ సంవత్సరానికి 57.7 శాతం వృద్ధిని నమోదు చేసి FY22లో 84.2 మిలియన్లకు చేరుకుంది. అయితే అమెరికా డాలర్‌తో రూపాయిలో ఏదైనా సానుకూల లేదా ప్రతికూల కదలిక అదే విధంగా జెట్ ఇంధన ధరలలో ఏదైనా పెరుగుదల లేదా తగ్గుదల భారతదేశంలోని విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది.
అందుకే ప్రయాణీకుల ట్రాఫిక్‌లో ఆశించిన మెరుగుదల ఉన్నప్పటికీ, ఎటిఎఫ్ ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం, ఈ రెండూ కారణాల వల్ల నష్టాలను వస్తున్నట్లు నివేదిక చెప్తోంది. ఏటీఎఫ్ కిలోలీటర్ ధర గత ఏడాది సుమారు రూ.7ంవేలు ఉండగా, ప్రస్తుతం రూ. లక్ష 24వేలకు చేరింది.
చదవండి: గౌతమ్ అదానీ: 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 2030 కల్లా నెం.1 లక్ష్యం!
Comments
Please login to add a commentAdd a comment