Domestic airline
-
బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్లో రికార్డ్
భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది.పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్‌గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్‌లైన్ మార్కెట్ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది. -
రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే!
కరోనా మహమ్మారి కారణంగా డీలా పడిన వాటిలో ఏవియేషన్ రంగం కూడా ఉంది. అయితే కరోనా పరిస్థితులు తొలగినా దేశీయ విమానయాన సంస్థలకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో.. విమానయాన సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15 నుంచి 17 వేల కోట్లు నష్టాలను చవిచూడబోతున్నారని తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడమే ఈ నష్టాలకు ప్రధాన కారణమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ రంగానికి రూ.23వేల కోట్ల నష్టం వాటిల్లింది. దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, గత కొన్ని నెలలుగా కరోనా కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదు కాకపోవడం వంటి కారణాలతో దేశీయ ప్రయాణీకుల రద్దీ సంవత్సరానికి 57.7 శాతం వృద్ధిని నమోదు చేసి FY22లో 84.2 మిలియన్లకు చేరుకుంది. అయితే అమెరికా డాలర్‌తో రూపాయిలో ఏదైనా సానుకూల లేదా ప్రతికూల కదలిక అదే విధంగా జెట్ ఇంధన ధరలలో ఏదైనా పెరుగుదల లేదా తగ్గుదల భారతదేశంలోని విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రయాణీకుల ట్రాఫిక్‌లో ఆశించిన మెరుగుదల ఉన్నప్పటికీ, ఎటిఎఫ్ ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం, ఈ రెండూ కారణాల వల్ల నష్టాలను వస్తున్నట్లు నివేదిక చెప్తోంది. ఏటీఎఫ్ కిలోలీటర్ ధర గత ఏడాది సుమారు రూ.7ంవేలు ఉండగా, ప్రస్తుతం రూ. లక్ష 24వేలకు చేరింది. చదవండి: గౌతమ్ అదానీ: 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 2030 కల్లా నెం.1 లక్ష్యం! -
ఇండియన్ ఎయిర్పోర్ట్ లలో వాటాలు అమ్మనున్న AAI
-
Dgca :67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టి వచ్చారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో దేశవ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టివచ్చారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 33.8 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. ఏప్రిల్‌లో 57.25 లక్షలు, మే నెలలో 21.15, జూన్‌లో 31.13, జూలైలో 50 లక్షల మంది ప్రయాణం చేశారు. గణాంకాలనుబట్టి మే నెలలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గత నెలలో ఇండిగో 38.16 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించి 57 శాతం వాటాను దక్కించుకుంది. స్పైస్‌జెట్ 5.84 లక్షల మంది ప్రయాణికులతో 8.7 శాతం వాటా పొందింది. ఎయిర్ ఇండియా 8.86 లక్షలు, గో ఫస్ట్ 4.58, విస్తారా 5.58, ఎయిర్ ఏషియా 3.49 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఆరు ప్రధాన విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేట్ 60.3–79.6 శాతం మధ్య నమోదైంది. స్పైస్‌జెట్ అత్యధికంగా 79.6 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. చదవండి: భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
రద్దీ పెరిగిపోతుంది, 49 లక్షలకు చేరిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో ప్యాసింజర్ ట్రాఫిక్ 57 శాతం వృద్ధి చెంది 49 లక్షలకు చేరింది. గతేడాది జూన్‌లో రద్దీ 31.1 లక్షలుగా ఉందని.. ఏడాది కాలంతో పోలిస్తే 132 శాతం వృద్ధి రేటు నమోదయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సగటున ప్రతి విమానంలో 104 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే జూన్ నెలలో ప్యాసింజర్ సంఖ్య 98గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్స్ సామర్థ్యం కూడా పెరిగింది. గతేడాది జులైలో 24,770 విమానాలు డిపార్చర్ కాగా.. ఈ ఏడాది జులై నాటికి 90 శాతం పెరుగుదలతో 47,200 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ అయ్యాయని పేర్కొంది. సగటు రోజు వారీ డిపార్చర్స్ చూస్తే.. గతేడాది జులైలో 800 విమానాలు కాగా.. ఈ ఏడాదికవి 1,500లకు పెరిగాయి. జూన్ నెలలో రోజుకు 1,100 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ జరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ కో–గ్రూప్ హెడ్ కింజల్ షా వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయ సంస్థలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లీజర్, వ్యాపార ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు -
జోరందుకున్న ఎయిర్ జర్నీ
ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య గతనెలలో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 114 లక్షల మంది దేశీ విమానాల్లో ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదలచేసిన డేటా ద్వారా వెల్లడైంది. ఏడాది ప్రాతిపదికన 18.95 శాతం వృద్ధి రేటు నమోదైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో 95.83 లక్షల మంది ప్రయాణికులు దేశీ విమానాల్లో ప్రయాణం చేశారు. గతనెలలో ఎయిర్ ట్రాఫిక్ పెరగడానికి.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు, పండుగల సీజన్ కావడమే ప్రధాన కారణమని డీజీసీఏ విశ్లేషించింది. నెంబర్ వన్ స్థానంలో ఇండిగో అత్యధిక ప్రయాణికులతో ఇండిగో మరోసారి రికార్డు సృష్టించింది. గతనెలలో 49.20 లక్షల మంది ప్రయాణీకులతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. మార్కెట్ వాటా 43.20%గా నమోదైంది. ఆ తరువాత స్థానంలోని జెట్ ఎయిర్వేస్ మార్కెట్ వాటా 14.2%కి పరిమితమైంది. ఈ ఎయిర్‌లైన్స్‌లో 16.13 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. స్పైస్ జెట్ ప్రయాణికుల సంఖ్య 13.63 లక్షలు కాగా, మార్కెట్ వాటా 12 శాతం. 13.45 లక్షల మంది ప్రయాణికులతో ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 11.8 శాతంగా నమోదైంది. -
మళ్లీ దేశీ ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్ ఆఫర్లు
ముంబై/న్యూఢిల్లీ: విమాన ధరల పోరులో రెండో రౌండ్ మొదలైంది. మరోసారి విమాన టికెట్ల ధరల తగ్గింపును స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇదే బాటలో జెట్ ఎయిర్వేస్, ఇండిగో, గో ఎయిర్, జెట్ కనెక్ట్‌లు కూడా డిస్కౌంట్ ఆఫర్లనందిస్తున్నాయి. ట్రావెల సీజన్ ముగుంపుకు వస్తుండటంతో ఇటీవలే ఎయిర్ ఇండియాతో సహా పలు కంపెనీలు డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో రౌండ్ ధరల తగ్గింపులో ఎయిర్ ఇండియా మినహా ఇతర కంపెనీలు సై అంటున్నాయి. సెకండ్ చాన్స్ పేరుతో తగ్గింపు ధరలకే విమాన టికెట్లను స్పైస్‌జెట్ అందిస్తుండగా, హ్యాపీ వీకెండ్ పేరుతో ఇండిగో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ కూడా ఇతే తరహా ఆఫర్‌ను అందిస్తోందని, పర్యాటక పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బేస్ చార్జీ, ఇంధన సర్‌చార్జీలపై 30 శాతం వరకూ డిస్కౌంట్‌ను జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్‌లు కూడా అందిస్తున్నాయని వివరించాయి. 30 రోజులు ముందు బుకింగ్ ఏప్రిల్ 15 లోపు చేసే ప్రయాణాలకు గాను 30 రోజులు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని రెండోసారీ ఇస్తామని స్పైస్‌జెట్ పే ర్కొంది. ఈ అవకాశం శుక్రవారం నుంచి మొదలై ఆది వారం అర్థరాత్రి వరకు అందుబాటులో ఉం టుందని వివరించింది. అంతక్రితం ఆఫర్‌కు మంచి స్పందన రావడంతో ఈ ఆఫర్‌ను పొడిగించామని పేర్కొంది. ఈ నెలలో విమానప్రయాణాలు చౌక భారత్‌లో విమాన యానం చేయాలంటే ఫిబ్రవరి నెల ఉత్తమమైనదని, ఈ నెలలో విమాన టికెట్లు చౌక(18%)గా లభిస్తాయని అంతర్జాతీయ ట్రావెల్ సెర్చ్ సైట్ స్కైస్కానర్ నివేదిక వెల్లడించింది. మూడేళ్ల టికెట్ల బుకింగ్ చరిత్ర ఆధారంగా ఈ సంస్థ బెస్ట్ టైమ్ టు బుక్ పేరిట ఒక నివేదికను రూపొందించింది.