మళ్లీ దేశీ ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్ ఆఫర్‌లు
ముంబై/న్యూఢిల్లీ: విమాన ధరల పోరులో రెండో రౌండ్ మొదలైంది. మరోసారి విమాన టికెట్ల ధరల తగ్గింపును స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇదే బాటలో జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, గో ఎయిర్, జెట్ కనెక్ట్‌లు కూడా డిస్కౌంట్ ఆఫర్లనందిస్తున్నాయి. ట్రావెల సీజన్ ముగుంపుకు వస్తుండటంతో ఇటీవలే ఎయిర్ ఇండియాతో సహా పలు కంపెనీలు డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో రౌండ్ ధరల తగ్గింపులో ఎయిర్ ఇండియా మినహా ఇతర కంపెనీలు సై అంటున్నాయి.
సెకండ్ చాన్స్ పేరుతో తగ్గింపు ధరలకే విమాన టికెట్లను స్పైస్‌జెట్ అందిస్తుండగా, హ్యాపీ వీకెండ్ పేరుతో ఇండిగో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ కూడా ఇతే తరహా ఆఫర్‌ను అందిస్తోందని, పర్యాటక పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బేస్ చార్జీ, ఇంధన సర్‌చార్జీలపై 30 శాతం వరకూ డిస్కౌంట్‌ను జెట్ ఎయిర్‌వేస్, జెట్ కనెక్ట్‌లు కూడా అందిస్తున్నాయని వివరించాయి.
30 రోజులు ముందు బుకింగ్
ఏప్రిల్ 15 లోపు చేసే ప్రయాణాలకు గాను 30 రోజులు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని రెండోసారీ ఇస్తామని స్పైస్‌జెట్ పే ర్కొంది. ఈ అవకాశం శుక్రవారం నుంచి మొదలై ఆది వారం అర్థరాత్రి వరకు అందుబాటులో ఉం టుందని వివరించింది. అంతక్రితం ఆఫర్‌కు మంచి స్పందన రావడంతో ఈ ఆఫర్‌ను పొడిగించామని పేర్కొంది.
ఈ నెలలో విమానప్రయాణాలు చౌక
భారత్‌లో విమాన యానం చేయాలంటే ఫిబ్రవరి నెల ఉత్తమమైనదని, ఈ నెలలో విమాన టికెట్లు చౌక(18%)గా లభిస్తాయని అంతర్జాతీయ ట్రావెల్ సెర్చ్ సైట్ స్కైస్కానర్ నివేదిక వెల్లడించింది. మూడేళ్ల టికెట్ల బుకింగ్ చరిత్ర ఆధారంగా ఈ సంస్థ బెస్ట్ టైమ్ టు బుక్ పేరిట ఒక నివేదికను రూపొందించింది.