వాషింగ్టన్: అమెరికాలో విమానంలో ఓ ప్రయాణికురాలిని సిబ్బంది ఆమె పాప కుర్చీతోనే కొట్టిన సంఘటన వెలుగుచూసింది. దీంతో ఆ ఉద్యోగిని సదరు విమాన సంస్థ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. శుక్రవారం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి డల్లాస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్(ఏఏ) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమాన సంస్థ ఉద్యోగి ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రయాణికురాలితో నిందితుడు గొడవ పడుతున్నట్లు కనిపించింది.
బాధితురాలిని కాపాడటానికి ఓ వ్యక్తి జోక్యం చేసుకోవడంతో కేబిన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని న్యూయార్క్ డైలీ న్యూస్ పేర్కొంది. ఆ వ్యక్తికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో బాధితురాలు తన పాపతో పక్కకు నిల్చొని ఏడుస్తూ ఉందని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
విమానంలో ప్రయాణికురాలిపై సిబ్బంది దాడి
Published Sun, Apr 23 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
Advertisement
Advertisement