ఉగ్ర కలకలం.. విమానం అత్యవసర ల్యాండింగ్
ఉగ్ర కలకలం.. విమానం అత్యవసర ల్యాండింగ్
Published Fri, Sep 23 2016 12:17 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
డల్లాస్: విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని అత్యవసరంగా టెక్సాస్లోని లబ్బక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కాలిఫోర్నియా నుంచి విమానం డల్లాస్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు.
కాలిఫోర్నియాకు చెందిన జెర్రీ బా గుయెన్ (24) అనే యువకుడు తోటి ప్రయాణికులకు హానికలిగించే విధంగా ప్రవర్తించాడని తెలిపిన ఎయిర్లైన్స్ అధికారులు మిగతా వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో జెర్రీపై కేసు నమోదు చేశారు. స్థానిక అసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితుడిని లబ్బాక్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ ఘటనతో 143 మంది ప్రయాణికులతో ఉన్న విమానం గంట ఆలస్యంగా డల్లాస్ ఫోర్ట్వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement