terror threat
-
టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు
పురుషుల టీ20 ప్రపంచకప్ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు (కరీబియన్ దీవులు) ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పొట్టి ప్రపంచకప్ సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు తెలుస్తుంది. ప్రో ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు ప్రారంభించాయి. తమ మద్దతుదారులంతా యుద్ధరంగంలో చేరాలని పిలుపునిస్తున్నాయి.ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చింది. టోర్నీకి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామని ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్స్ హామీ ఇచ్చారు.కాగా, టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యమిస్తుంది. జూన్ 1 నుంచి ఈ క్రికెట్ మహాసంగ్రామం ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. వారి పక్క దేశమైన కెనడాతో తలడనుంది. మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్‌లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. -
తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరించింది. సుమారు 15 మంది సముద్ర మార్గం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించారని, తీరం నుంచి కేరళకు వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్ చేరుకునేందుకు పథకం వేశారని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని కోస్ట్‌గార్డ్ దళాలు, ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు ఆదేశించా రు. ఇదిలా ఉండగా చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో అనుమానాస్పదంగా ఉంటున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అయోధ్యలో హైఅలర్ట్
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న భవ్య రామ మందిరం భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని, తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేశాయి. అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన సాకేత్ మహావిద్యాలయ ప్రాంగణంలో హెలికాప్టర్లో దిగుతారు. ఇక్కడి నుంచి రామ జన్మభూమి వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేస్తున్నారు. -
భారత-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్ర ముప్పు
విశాఖ: టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇరు జట్ల క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత పెంచారు. అదే సమయంలో విశాఖ తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరొకవైపు విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్‌గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం నగరంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. ఆదివారం ఇక్కడ చివరి రోజు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్ర ముప్పు అంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో క్రికెటర్లకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
‘సరదా కోసమే చేశా.. ఇలా జరుగుతుంది అనుకోలేదు’
కోల్‌కతా : ఓ ప్యాసింజర్ చేసిన ఆకతాయి పని వల్ల రన్ వేపై ఉన్న విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఈ ఘటన సోమవారం కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాలు.... కోల్‌కతా నుంచి ముంబై వెళ్లేందుకు యోగివేదాంత్ పోద్దార్ అనే యువకుడు జెట్ ఎయిర్వేస్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం 9w-472 నంబరు గల విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన ఫోన్ తీసి.. ‘విమానంలో టెర్రరిస్టు ఉన్నాడు. అమ్మాయిల హృదయాల్ని కొల్లగొడతా’ అంటూ స్నేహితులకు మెసేజ్ చేయడంతో పాటు....కర్చీఫ్‌ను ముఖానికి కట్టుకుని ఫొటో దిగాడు. ఇదంతా గమనించిన మరో ప్యాసింజర్ భయంతో సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు యోగివేదాంత్ను విచారించారు. ఈ క్రమంలో కేవలం తాను సరదా కోసమే ఇలా చేశానని, దీనిపై ఇంత రాద్దాంతం జరుగుతుందని ఊహించలేదని అతడు పేర్కొన్నాడు. దీంతో అతడి గురించి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం అధికారులు యోగిని విడిచిపెట్టారు. అదే విమానంలో అతడిని ముంబైకి పంపించారు. కాగా యోగి చేసిన ఆకతాయి పని వల్ల విమానాన్ని అత్యవసరంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారి తెలిపారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఏ విషయాన్ని తేలికగా తీసుకోలేమని, ఈ కారణంగానే విమానం గంట ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు. -
ఆల్రెడీ పాక్‌లోకి ఎంటరయ్యాడు ; చైనా గుబులు
ఇస్లామాబాద్ : ‘‘ఇప్పటికే అతను పాకిస్థాన్‌లోకి ఎంటరయ్యాడు. పేరు.. అబ్దుల్ వలీ. అతని పాస్‌పోర్ట్, వీసా డిటెయిట్స్ పంపిస్తున్నాం. గుర్తుంచుకోండి.. అతనికి కావాల్సింది చైనా రాయబారి ప్రాణాలు! ఒకవేళ అతను అనుకున్నది జరిగితే.. మన రెండు దేశాలకీ ఎంత నష్టమో మీకు తెలుసు. కాబట్టి జాగ్రత్త వహించండి. తక్షణమే మా రాయబారికి తగినంత భద్రత ఏర్పాటు చేయండి.’’...... ఇదీ.. ప్రతిష్టాత్మక చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ముఖ్యఅధికారి పింగ్ యింగ్ ఫీ, పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రికి రాసిన లేఖ. కొద్ది గంటల కిందటే వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం పాక్‌లో సంచలనంగా మారింది. ఎవరిని హత్య చేయబోతున్నారు? : అఫ్ఘనిస్థాన్‌లో చైనా రాయబారిగా పనిచేసిన యావో జింగ్.. అక్టోబర్ 19న పాక్‌లో చైనీస్ రాయబారిగా నియమితులయ్యారు. మొన్ననే ఇస్లామాబాద్‌కు వచ్చిన ఆయనను అంతం చేసేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. జింగ్ ప్రాణాలే లక్ష్యంగా ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటిమ్)కు చెందిన అబ్దుల్ వలీ అనే ఉగ్రవాది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో మాటు వేశాడని చైనా చెబుతోంది. అతన్ని వెంటనే బంధించి తనకు అప్పగించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ఎవరీ అబ్దుల్ వలీ? : ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో అంతుచిక్కకుండా తిరుగుతోన్న అబ్దుల్ వలీ సొంతదేశం చైనాయే!. అవును. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఉయ్ఘర్ తెగకు చెందిన ముస్లింలు అధికంగా నివసిస్తూఉంటారు. అబ్దుల్ వలీ ఆ తెగకు చెందినవాడే. ఉయ్ఘర్ ముస్లింలు.. తాము చైనాలో కలిసి ఉండబోమని, ప్రత్యేక దేశం కావాలని ‘ఈస్ట్ టర్కిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటిప్) పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. వారికి టర్కీ, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిరిజిస్థాన్, పాకిస్థాన్, ఆప్ఘానిస్థాన్లో ఉండే ఉయ్ఘర్ ముస్లింల మద్దతు కూడా ఉంది. పాక్‌లో స్పాట్ పెట్టారెందుకు? : ఇటీవలికాలంలో ఉధృతమైన ఈటిప్ ఉద్యమాన్ని చైనీస్ ప్రభుత్వం తన ఉక్కుపాదంతో అణిచేసింది. ఆ సంస్థను నిషేధించడంతోపాటు వేలమంది ఉయ్ఘర్ ముస్లింలను అరెస్టుచేసి జైళ్లలోకి నెట్టేసింది. ప్రభుత్వంపై కక్షను పెంచుకున్న ఈటిప్ స్లీపర్ సెల్స్.. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో దాడులు చేయాలని పథకాలు వేశారు. పాక్‌లోని తమ స్నేహితుల సాయంతో అక్కడ పనిచేస్తోన్న చైనా అధికారులను అంతం చేయాలని స్కెచ్ వేశారు. అయితే వారి కదలికలపై చైనా గట్టి నిఘా ఉంచడంతో కట్టడి వీలైంది. తాజా ఉదంతంలోనూ దాడికి పాల్పడబోయేవాడి పేరు(అబ్దుల్ వలీ), వివరాలను చైనీస్ నిఘావర్గాలు పసిగట్టగలియాయి. ‘అధికారిక’ మౌనం : ‘పాక్‌లో చైనీస్ రాయబారి హత్యకు కుట్ర’ కథనాలు సంచలనం రేపుతున్నప్పటికీ ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇప్పటివరకు నోరెమెదపలేదు. ఉన్నతస్థాయిలో జరిగిన ప్రత్యుత్తరాలు మీడియాకు ఎలా లీకయ్యాయి? అనేదానిపైనా వివరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. -
పూరీ జగన్నాథ రథయాత్రకు ఉగ్రముప్పు!
పూరీ(ఒడిశా): విశ్వవిఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారా? పూరీలో దాడులు చేయాలని ప్లాన్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పూరీ జగన్నాథ రథయాత్రకు భారీ భద్రత కల్పిస్తున్నారు. జల మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగానే‘సౌనక్’ పహరా నౌకను పారాదీప్ ఓడరేవులో నిలిపారు. ‘సౌనక్’కు తోడుగా మరో 2 వేగవంతమైన పెట్రోలింగ్ ఓడలు కూడా చేరాయి. పారాదీప్ నుంచి పూరీ వరకు సువిశాల సముద్ర మార్గంలో ఈ ఓడలు భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తాయి. ఇవీ సౌనక్ ప్రత్యేకతలు.. సౌనక్ పూర్తిగా స్వదేశీ తయారీ ఓడ కావడం విశేషం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన కోస్ట్‌గార్డ్ వాహినిలో సౌనక్ను చేర్చారు. దీని పొడవు 105 మీటర్లు. 9,100 కిలో వాట్ల శక్తివంతమైన 2 డీజీలు ఇంజిన్లతో సౌనక్ గంటకు 26 నాట్ల వేగంతో దూసుకుపోతుంది. 2 తేలికపాటి హెలికాప్టర్లు, 30 ఎం.ఎం. క్లోజ్ రేంజ్ నావికా తుపాకులు, 5 అత్యాధునిక హై–స్పీడ్ పడవలు అనుక్షణం అందుబాటులో ఉంటాయి. సముద్రంలో తైల కాలుష్యం లేకుండా సౌనక్ పని చేయడం మరో విశేషం. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందజేసేందుకు దీనిలో 14 మంది కోస్టు గార్డు అధికారులు, 98 మంది జవాన్లను నియమించారు. సముద్ర ఠాణా పోలీసుల సమన్వయంతో సౌనక్ ఓడ రేవు అనుక్షణం అప్రమత్తంగా సముద్ర మార్గం గుండా ఉగ్రవాదుల చొరబాటుపై నిఘా వేస్తుంది. -
కేరళలో ప్రధానికి ఉగ్ర ముప్పు!
కొచ్చి: కేరళలో కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించిన సమయంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర డీజీపీ టీపీ సేన్‌కుమార్ చెప్పారు. ఆ సమయంలో ఓ ఉగ్ర సంస్థ అక్కడ క్రియాశీలకంగా ఉందని, ఇంతకుమించి వివరాలను వెల్లడించడం సాధ్యం కాదన్నారు. కొచ్చిలో ఎల్పీజీ టెర్మినల్‌ను వ్యతిరేకిస్తున్న వారిపై శుక్రవారం హైకోర్టు సమీపంలో పోలీసుల చర్యను సమర్థిస్తూ సేన్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. మోదీ కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎస్పీజీ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా నిరసనకారులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. నిరసనకారులు అనూహ్యంగా దూసుకొచ్చారని, వారిని అదుపు చేయడానికి లాఠిచార్జి చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఆందోళన వెనుక తీవ్రవాద సంస్థల హస్తముందని స్పష్టం చేశారు. పోలీసులు జరిపిన లాఠిచార్జిలో కనీసం 20 మంది గాయపడ్డారు. లాఠిచార్జికి కొచ్చి నగర పోలీసు కమిషనర్ యతిశ్ చంద్ర ఆదేశాలిచ్చారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రధాని మోదీ శనివారం కొచ్చిలో పర్యటించారు. కొచ్చి మెట్రో మొదటి దశను జాతికి అంకితం చేశారు. -
ఐఎస్ ముప్పు.. చైనాలో కలవరం!
అంతర్జాతీయ మత ఉగ్రవాదపు జాడలు దేశంలోనూ విస్తరిస్తున్నాయని చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ముస్లిం మైనారిటీలు ఇరాక్, సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పోరాడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పుపై తాజాగా చైనా అధికారులు హెచ్చరికలు జారీచేశారు. జింగ్జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ టాప్ అధికారి షర్హాత్ అహాన్ తాజాగా ఉగ్రవాదజాడలపై హెచ్చరికలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ ఉగ్రవాద పరిస్థితుల కారణంగా చైనా అస్థిరతకు లోనయ్యే అవకాశముందని, దీని ప్రజాయుద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే జింగ్జియాంగ్ ప్రావిన్స్ గత కొన్నాళ్లుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఇక్కడ స్థానిక వీఘర్ ముస్లిం తెగ ప్రజలు చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇటీవలికాలంలో ఇక్కడ చోటుచేసుకున్న హింసలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇక్కడి వీఘర్ ఇస్లామిక్ వేర్పాటువాదులకు అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చైనా ఆరోపిస్తున్నది. వీఘర్ వేర్పాటువాదులతో చైనా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నది. వీఘర్ వేర్పాటువాదులకు తాము ఇరాక్‌లో శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే చైనాలో దాడులు జరుపుతామని ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ ఓ వీడియోలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో మాట్లాడిన అర్హాత్ ఆహాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాలని, ప్రజల ఆస్తులను కాపాడేందుకు, చైనా శక్తిని చాటేందుకు కృతనిశ్చయాన్ని చాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ఇప్పటికే జింగ్జియాంగ్ ప్రావిన్స్‌లో అధికార యంత్రాంగం గస్తీని ముమ్మరం చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ బహిరంగ ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. -
అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాల హెచ్చరికలు చేశాయి. జనవరిలో అత్యంత్ర అప్రమత్తంగా ఉండాలని ఐబీ సూచించింది. ఈ వేడుకల సందర్బంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలలో దాడులు జరగవచ్చనని నిఘా వర్గాలు ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలను హెచ్చరించాయి. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించింది. -
అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
-
ఉగ్ర కలకలం.. విమానం అత్యవసర ల్యాండింగ్
డల్లాస్: విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసరంగా టెక్సాస్‌లోని లబ్బక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కాలిఫోర్నియా నుంచి విమానం డల్లాస్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియాకు చెందిన జెర్రీ బా గుయెన్ (24) అనే యువకుడు తోటి ప్రయాణికులకు హానికలిగించే విధంగా ప్రవర్తించాడని తెలిపిన ఎయిర్‌లైన్స్ అధికారులు మిగతా వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో జెర్రీపై కేసు నమోదు చేశారు. స్థానిక అసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితుడిని లబ్బాక్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ ఘటనతో 143 మంది ప్రయాణికులతో ఉన్న విమానం గంట ఆలస్యంగా డల్లాస్ ఫోర్ట్‌వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ముంబైలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం?
భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి ఉలిక్కిపడింది. నగరంతో పాటు సముద్రతీరంలో కూడా ఒక్కసారిగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో నవీముంబైలోని ఓ నేవల్ బేస్‌కు సమీపంలో తిరుగుతుండగా తాము చూశామని కొంతమంది విద్యార్థులు చెప్పడంతో మళ్లీ ఒక్కసారిగా నగరంలో ఉగ్రవాదులు ప్రవేశించారన్న కలకలం రేగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలను ముంబైలోని మూడు కీలక ప్రాంతాల్లో మోహరించారు. అవసరమైతే వచ్చేందుకు సిద్ధంగా మరో బృందం ఢిల్లీలో ఉంది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడి 18 మంది భారతీయ సైనికులను హతమార్చిన నేపథ్యంలో, ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ముంబై నగరం మొత్తాన్ని హై ఎలర్ట్‌లో ఉంచారు. నౌకాదళం హై ఎలర్ట్‌లో ఉందని, ముంబైలోని కరంజా ప్రాంతంలో కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు స్కూలు పిల్లలు చెప్పడంతో తనిఖీలు ముమ్మరం అయ్యాయని భారత నౌకాదళం ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. తనిఖీలు ప్రారంభించేందుకు ముందే ఆ ప్రాంతంలోని స్కూళ్లన్నింటినీ పోలీసులు మూయించేశారు. నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్న మొత్తం 91 ప్రాంతాలనపు కూడా అప్రమత్తం చేశారు. 2008లో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు నగరంలోకి జలమార్గంలో ప్రవేశించి నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ముంబై నగరం ఏ చిన్న విషయం తెలిసినా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. గేట్‌వే ఆఫ్ ఇండియా, రాజ్‌భవన్, బాంబే హై వద్ద డ్రిల్లింగ్ రిగ్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భద్రత ముమ్మరం చేశారు. నగరం మొత్తం హై ఎలర్ట్ ప్రకటించామని, భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకున్నామని ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ దేవేన్ భర్తీ తెలిపారు. రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి.. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముంబైకి, పాకిస్థాన్‌కు మధ్య ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని కూడా అప్రమత్తం చేశారు. నిఘా సంస్థలు తీరప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అదనపు డీజీపీ తీర్థరాజ్ తెలిపారు. -
ఉగ్రవాదులకు వాట్సప్ సాయం?
వాట్సప్, వైబర్, హైక్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాయా? అందుకోసం వాటిని నిషేధించాలా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో వినిపిస్తున్నాయి. హర్యానాకు చెందిన సుధీర్ యాదవ్ అనే ఈ మేరకు ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలుచేశారు. మెసేజీలను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా ఈ యాప్‌లు ఉగ్రవాదులకు, నేరగాళ్లకు సాయం చేస్తున్నాయని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజీలను ఇంటర్క్రిప్ట్ చేయడం.. అంటే వాటిని మధ్యలోనే చదవడం అసాధ్యం. ఉగ్రవాదులు ఒకరికి ఒకరు వాట్సప్, వైబర్ లాంటి యాప్‌ల ద్వారా సందేశాలు పంపుకొన్నప్పుడు వాటిని నిఘా సంస్థలు మధ్యలోనే పట్టేసినా.. అవి ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి కాబట్టి అందులో ఏముందో తెలుసుకోలేరు. పంపిన వ్యక్తి, దాన్ని అందుకున్న వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. సూపర్ కంప్యూటర్లు కూడా ఇలా ఎన్‌క్రిప్ట్ చేసిన సందేశాలను చదవలేవు. ఎన్‌క్రిప్ట్ చేసిన ఒక మెసేజిని డీక్రిప్ట్ చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని యాదవ్ తెలిపారు. అందువల్ల వాట్సప్, వైబర్, టెలిగ్రామ్, హైక్, సిగ్నల్ లాంటి యాప్‌లు జాతీయ భద్రతకు ముప్పు అని, వాటిని నిషేధించాలని తన పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 29న విచారిస్తుంది. -
ఎట్టి పరిస్థితుల్లో ఆ హోటల్‌కు వెళ్లకండి!
పాక్‌లోని తమ పౌరులకు అమెరికా హెచ్చరిక వాషింగ్టన్: పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులకు అమెరికా ఎన్నడూలేని రీతిలో చాలా కచ్చితమైన హెచ్చరికలు చేసింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న మారియట్ హోటల్‌కు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దని సూచించింది. ఈ మేరకు తమ దేశ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వయిజరీని అమెరికా విదేశాంగ శాఖ జారీచేసింది. ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌కు పెద్ద ముప్పే పొంచి ఉన్నట్టు అక్కడి తమ రాయబార కార్యాలయానికి సమాచారముందని తెలిపింది. 'రానున్న కొన్ని రోజులపాటు ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లరాదని అమెరికా పౌరులకు చాలా కచ్చితమైన సలహా ఇస్తున్నాం' అని విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్‌లో నెలకొన్న భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశానికి వెళ్లే అనవసరమైన పర్యటనలన్నింటీని వాయిదా వేసుకోవాలని అమెరికా తన పౌరులను కోరింది. పాకిస్థాన్‌లో ఇటీవల ఉగ్రవాద హింస పెచ్చు మీరుతున్న సంగతి తెలిసిందే. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో అమెరికన్లతోపాటు విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 16న ఓ అమెరికా విద్యావేత్తను పాక్‌లో మోటారు బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. -
'మా దేశానికి ఉగ్రముప్పు లేదు'
వాషింగ్టన్: అమెరికాపై ప్రస్తుతానికైతే ఎటువంటి ఉగ్రవాద సంస్థలు దాడిచేసేలా కనిపించడం లేదని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దేశ నిఘా విభాగం, ఇతర వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతానికి ఎలాంటి దాడులు జరిగే సూచనలు కనిపించడం లేదన్నారు. వర్జీనియాలోని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్లో యూఎస్ సెక్యూరిటీ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఉగ్రముప్పు అంశంపై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడి సూచనలు కనిపించనప్పటికీ, దేశమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉగ్రవాదుల టార్గెట్ అమెరికా అయినట్లయితే... వారికి ఇక కష్టాలు తప్పవంటూ హెచ్చరించారు. వ్యక్తిగతంగా, చిన్న చిన్న కార్యకలాపాల ద్వారా ఉగ్రదాడులు చేస్తే వాటిని అరికట్టడం కష్టసాధ్యమని చెప్పారు. అమెరికాను ఉగ్రదాడులకు దూరంగా ఉంచడానికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, సిరియా, ఇరాక్ లలో ఉన్న ఐఎస్ఐఎల్ పై ఎన్నడు లేని విధంగా దాడి జరపాలన్నారు. ఆ దేశాల నేతలతో కూడా ఈ విషయంపై చర్చించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా కాల్పుల ఘటనను దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి అమెరికాకు వచ్చే శరణార్థులలో ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నందున బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టి ఐఎస్ఎస్ ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేస్తామన్నారు. -
ఢిల్లీలో దాడులకు జైషేప్రణాళికలు?
-
బ్రిటన్ విమానాశ్రయాలకు ఉగ్రవాదుల ముప్పు, హైఅలర్ట్!
లండన్: ఉగ్రవాదుల ముప్పుందనే వార్తలతో బ్రిటన్ విమానాశ్రయాల్లో గురువారం హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు గుర్తించడానికి వీలులేని, తనిఖీల్లో బయటపకుండా కొత్త రకం బాంబులను విమానాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు బ్రిటన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిరియాలో మిలిటెంట్లు పరీక్షించిన కొత్త రకం బాంబులను రెండు ఉగ్రవాద సంస్థలు విమానాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందిందని.. అందుకే గట్టి భద్రతలు తీసుకున్నామని మీడియాకు వెల్లడించారు. తనిఖీ పరికరాలకు చిక్కకుండా టెర్రరిస్తులు తమ దేహాల్లో కొత్త రకం బాంబులను అమర్చుకుంటున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయని అధికారులు తెలిపారు. బ్రిటన్ పౌరులకు హాని కలిగించేదుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు అందాయని, అందుకే ఉగ్రవాదులు ప్రయత్నాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ తెలిపారు. -
తమిళనాడు టెంపుల్స్ వద్ద హైఅలర్ట్
-
'ఎన్నికలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు'
-
ఎన్నికలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు
-
తీవ్రవాదులతో సాధారణ ఎన్నికలకు ఆటంకం!
రానున్న సాధారణ ఎన్నికలను తీవ్రవాదులు ఆటంక పరిచే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో శనివారం విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసి రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసుకుంటు నక్సలిజాన్ని నిర్మూలించవచ్చని తెలిపారు. నక్సల్ అణచివేతలో పారమిలటరీ సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. సైబర్ క్రైమ్‌ను అణిచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని ప్రధాని మన్మోహన్ గుర్తు చేశారు. దేశంలోని దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును మెరుగుపరుచుకున్నాయని మన్మోహన్ ఈ సందర్భంగా కితాబ్ ఇచ్చారు. -
ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు!
స్వాతంత్ర్య దిన వేడుకల సందర్భంగా నిఘా వర్గాల నుంచి హెచ్చరిక రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై ఎలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వ్యక్తిగత, వాణిజ్య వాహనాలతో సహా అన్ని వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దుల ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించే ఏ ఒక్క వాహనాన్నీ వదలొద్దని ఢిల్లీ అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు. ఢిల్లీ పోలీసులతో పాటు కమాండోలు, మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బంది, షార్ప్ షూటర్లను కూడా ఎర్రకోట చుట్టూ మోహరించారు. దాదాపు ఆరువేల మంది భద్రతా దళాల సిబ్బందిని ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించినట్లు శుక్లా చెప్పారు. షార్ప్ షూటర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులతో కూడిన బృందం భద్రతను పటిష్ఠంగా చూస్తుందని ఆయన తెలిపారు. నగరంలోకి ప్రవేశించే, నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాలన్నింటిలోనూ ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఉండి, డేగకళ్లతో మొత్తం వాహనాలన్నింటినీ పరిశీలిస్తారు. పత్తర్ గంజ్, జామా మసీదు, ఎర్రకోట చుట్టుపక్కల ఉండే అన్ని ఎత్తయిన భవనాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, మార్కెట్లు, రెస్టారెంట్ల వద్ద నిఘా మరింత పటిష్ఠంగా ఉంటుంది. ఎక్కడైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే చెప్పాల్సిందిగా రిక్షా కార్మికులను కూడా అప్రమత్తం చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్టాపులు, మార్కెట్లు, మాళ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో కూడా భద్రతను పటిష్ఠం చేశారు. ఆగస్టు 15 నేపథ్యంలో దేశ రాజధానికి ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉందని తమకు నిఘా వర్గాల నుంచి లేఖ అందినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చుట్టుపక్కల ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు.