
తీవ్రవాదులతో సాధారణ ఎన్నికలకు ఆటంకం!
రానున్న సాధారణ ఎన్నికలను తీవ్రవాదులు ఆటంక పరిచే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో శనివారం విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసి రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసుకుంటు నక్సలిజాన్ని నిర్మూలించవచ్చని తెలిపారు.
నక్సల్ అణచివేతలో పారమిలటరీ సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. సైబర్ క్రైమ్ను అణిచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని ప్రధాని మన్మోహన్ గుర్తు చేశారు. దేశంలోని దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును మెరుగుపరుచుకున్నాయని మన్మోహన్ ఈ సందర్భంగా కితాబ్ ఇచ్చారు.